రెగ్యులర్‌గా బ్లాక్ డ్రెస్, బ్లాక్ మాస్క్‌లో కనిపించే ఆమెను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆమె కుటుంబ నేపథ్యం కూడా చాలా బలమైనది. ఆమె తండ్రి వినోద్ కుమార్ చౌదరి జేడీయూ మాజీ ఎమ్మెల్యే కాగా, ఆమె తాత ఉమాకాంత్ చౌదరి నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితులు. అంత బలంగా జేడీయూలో కుటుంబం ఉన్నా, ఆమె మాత్రం తన సొంత పార్టీతో బరిలోకి దిగి ఆశ్చర్యపరిచారు. దర్భంగాలో దారుణమైన షాక్!..అయితే, తాజాగా వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రియా చౌదరికి దారుణమైన షాక్ ఇచ్చాయి! ఆమె నమ్మకం, ఆమె ప్రతిజ్ఞ దర్భంగా ప్రజల ముందు తేలిపోయాయి.
దర్భంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రియా చౌదరి... కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక, ఎనిమిదో స్థానానికే పరిమితమయ్యారు! ఎన్డీయే తరఫున బీజేపీకి చెందిన సంజయ్ సరోగి ఏకంగా 97,453 ఓట్లతో విజయం సాధించగా... ప్రియా చౌదరి ఖాతాలో పడింది కేవలం 1,403 ఓట్లు మాత్రమే! ఈ దారుణ ఓటమి దేశ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మాట నిలబెట్టుకుంటారా? .. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఆమె ప్రతిజ్ఞ గురించే మాట్లాడుకుంటోంది. "గెలిచే వరకు మాస్క్ తీయను" అని శపథం చేసిన ప్రియా చౌదరి ఇప్పుడు ఏం చేస్తారు? ఆమె మాట ప్రకారం... ఇకపై ఆమెను నిత్యం మాస్క్‌లోనే చూడాల్సి ఉంటుందా? లేక, రాజకీయాల్లో ఇలాంటివి కామనే అని మాటను గట్టున పెడతారా? ఈ హాట్ క్వశ్చన్‌కి ఆమె ఎలా సమాధానం చెబుతారు అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది! ఏదేమైనా, ఒక సంచలన ప్రతిజ్ఞ ఆమెను ఎన్నికల ఫలితాల తరువాత కూడా వైరల్ అయ్యేలా చేసింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి