ఆంధ్రప్రదేశ్లో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది. అటు అధికార కూటమి ఇటు వైసిపి నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే ఇప్పుడు సతీష్ కుమార్ కేసులో పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వినిపిస్తున్నాయి. సిఐ సతీష్ తలపై ఎవరో బలంగా నరికినట్టుగా గుర్తులు ఉన్నాయని శరీరంలో చాలాచోట్ల ఎముకలు విరిగిపోయాయని పోలీసులు సైతం తెలియజేస్తున్నారు.


గురువారం రోజున రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ఏసీ బోగీలో ప్రయాణించిన సతీష్ తాడిపత్రి సమీపంలో కోమలి గ్రామం వద్ద ఉండే రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం కనిపించడంతో సంచలనంగా మారింది. సతీష్ 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఉదయం మరణించి ఉంటారని అధికారులు తెలియజేస్తున్నారు. సతీష్ ప్రయాణించినటువంటి ఏసీ బోగీలో ఎవరెవరు ప్రయాణించారని కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రైలులోనే సతీష్ ని చంపి బయట పడేసారా? అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ప్రస్తుతం సతీష్ సెల్ ఫోన్ కూడా అధికారులు స్వాధీనం చేసుకొని ల్యాబ్ కి పంపించినట్లు సమాచారం.



తిరుమల పారకామణి అక్రమార కేసులో కీలకమైన వ్యక్తి సతీష్ . అలాంటి వ్యక్తి మృతి చెందడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిఐ సతీష్ వైసీపీ నేతలు హత్య చేసి ఉంటారని కూటమినేతల ఆరోపిస్తూ ఉండగా, వైసీపీ నేతలు సైతం ప్రభుత్వ వేధింపులు, ఒత్తిడి వల్లే మృతి చెందారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక సతీష్ స్నేహితులు మాత్రం అతడు సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదని, పై అధికారుల నుంచి భారీ ఒత్తిడి ఉందని తనకు ఎన్నోసార్లు చెప్పారంటూ స్నేహితులు రామాంజనేయులు తెలియజేశారు.


2023లో ఏప్రిల్ టీటీడీ ఉద్యోగి రవికుమార్  ఆలయంలో పరకామణిలో విదేశీ కరెన్సీలను సైతం దొంగతనం చేస్తూ పట్టు పడ్డారు. ఈ ఘటన పైన రవి కుమార్ పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత అటు రవికుమార్, సతీష్ కుమార్ ఇద్దరు కూడా రాజీ కుదుర్చుకున్నారు. సతీష్ చాలా రోజులు రిజర్వ్ పోలీసు విభాగంలో కూడా పనిచేశారు. డిప్యూషన్ పై టీటీడీలో వివిధ హోదాలో కూడా విధులు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: