తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయిపోయింది.. ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయాన్ని సాధించింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మైలేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇంతటి విజయానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అంటూ చాలామంది అనుకుంటున్నారు.  అభ్యర్థి కేటాయింపు నుంచి మొదలు అభ్యర్థి గెలుపు వరకు ఎంతో కృషిచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో  నవీన్ యాదవ్ ని గెలిపించారు. అంతేకాదు కాంగ్రెస్ తెలంగాణలో బలంగా ఉంది. బీఆర్ఎస్ పలచబడి పోయిందంటూ ఒక మెసేజ్ కూడా అందేలా చేశారు. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని ప్రకటించిన కాంగ్రెస్, ఆ విధంగానే 42శాతం రిజర్వేషన్ కోసం అన్ని పూర్తి చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ వద్దకు పంపారు.

 కానీ గవర్నర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ ఫైల్ పక్కన పెట్టేసారు. 42 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని, కొంతమంది కోర్టుకు వెళ్లడంతో  కోర్టు కూడా 42% రిజర్వేషన్ కుదరదని, అన్ని రిజర్వేషన్స్ కలిపి 50% దాటకూడదనే నిబంధన ఉందని, దాన్ని కాదని మీరు ఎలా ఇస్తారంటూ మొట్టికాయలు వేసింది. అంతేకాదు దీనిపై విచారణకు కూడా ఆదేశించింది. త్వరలోనే ఎలక్షన్స్ నిర్వహించాలని సాకులు చెప్పవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24 వరకు తప్పకుండా ఎలక్షన్స్ వెళ్లే దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, నవంబర్ 17న క్యాబినెట్ సమావేశం నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికలపై తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

 బీసీలకు 42శాతం రిజర్వేషన్స్ ను బిజెపి అడ్డుకుంటుందని అన్నారు. ఇక ఆయన మాటల వెనుక ఉన్న ఆంతర్యం చూస్తే మాత్రం తప్పకుండా ఎలక్షన్స్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎలక్షన్స్ పెడతారా, లేదంటే పార్టీ తరపున 42శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్స్ కు వెళ్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ పార్టీ తరఫున రిజర్వేషన్ ఇస్తే మాత్రం ఇప్పుడున్న రిజర్వేషన్లు మారే అవకాశం ఉండదు. ఒకవేళ పాత లెక్కల ప్రకారం వెళ్తే  స్థానిక సంస్థల రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీంతో పోటీ చేయాలని చూస్తున్న ఆశావాహులకు కొత్త గుబులు పట్టుకుంది.రిజర్వేషన్లు మారితే మళ్ళీ తమ ప్రాంతాల్లో ఏ రిజర్వేషన్  వస్తుందో అని భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: