తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలపాటు బీఆర్ఎస్ తన హవా నడిపింది.. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పాలన అంతా  అద్భుతంగా సాగిందని చెప్పవచ్చు. కానీ మూడవసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. దీంతో కేసీఆర్ పార్టీలో చీలికలు వచ్చాయి. ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఒక్క సీటు, ఉప ఎన్నికల్లో కూడా డీలా పడడం వంటివి నడుస్తున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీ గురించి నాయకుల గురించి  వారు చేసిన అక్రమాలపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ప్రజలకు చెప్పడం జరుగుతుంది.. అలాంటి కవిత కొత్త పార్టీ పెడుతుందని చాలా కాలం నుంచి ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పార్టీ ఎప్పుడు పెడుతుందో ఎందుకు పెడుతుందో క్లారిటీ ఇచ్చింది.. అదేంటో చూద్దాం.. ప్రస్తుతం కవిత జాగృతి పేరుతో ప్రజల్లో ఉంటుంది. ప్రతిరోజు ప్రజా సమస్యలపై కొట్లాడుతూ  కేటీఆర్,హరీష్ రావు చేసిన తప్పులను ఎత్తిచూపుతోంది.. అయితే కవిత ప్రస్తుతం రాజకీయమే చేస్తుంది కానీ ఒక పార్టీ బేస్ పై మాత్రం చేయడం లేదు. తాను కూడా పార్టీ  పెడతాను కానీ దానికో సమయం కావాలి అన్నట్టు ఎదురు చూస్తోందని తెలుస్తోంది.. 

అయితే దాదాపు పది సంవత్సరాలపాటు కేసీఆర్ తో జర్నీ చేసిన కవిత ఆ పార్టీలో ఏం జరిగిందో ఏం జరగబోతుందో కూడా  తెలుసుకుంది.. ఇదే సమయంలో కవిత పలు మీడియా ఛానల్స్ ముందే బీఆర్ఎస్ ఎప్పటికైనా బీజేపీలో విలీనం అవుతుందని చెప్పకనే చెప్పింది. ఆ సాంకేతాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కనిపించాయని బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. అందుకే ఎన్నికను పెద్దగా సీరియస్ తీసుకోలేదని అన్నది.. అంతేకాదు గతంలో బండి సంజయ్ కి అధ్యక్ష పదవి రాకపోవడంతో కావాలనే బీజేపీ బండి సంజయ్ పదవి తీసేసిందని, బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం కోసం ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకొచ్చింది.. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయింది. దీంతో తెలంగాణ బ్రాండ్ కాస్త వెనకబడిపోయింది. అయితే పార్టీ పేరు మార్చిన తర్వాత తెలంగాణలో ఎన్నిసార్లు సెంటిమెంటు రగిలించాలని చూసినా ఫలించడం లేదు.

దీంతో బీఆర్ఎస్ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీరికి బీజేపీతో పొత్తే శరణ్యం అంటూ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ బిజెపిలో విలీనం అయితే మాత్రం ఆ తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ కోసం ప్రజలు ఎదురుచూస్తారు. ఆ టైంలోనే కవిత ఎంట్రీ ఇచ్చి  బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువస్తానని చెప్పకనే చెబుతోంది. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలే ఉంటాయి. మరి తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ ఒకటి ఉండాలి. ఆ పార్టీ నే కవిత తీసుకువస్తుందని సమాచారం. ఇప్పుడే పార్టీ పెట్టొచ్చు కానీ, ఎన్నికల వరకు ఆ పార్టీ పాతబడిపోతుంది. అదే బిజెపి బీఆర్ఎస్ కలిసి ఒప్పందానికి వచ్చిన సమయంలో పార్టీ పెడితే, బిజెపిలోకి వెళ్లలేని లీడర్లు అంతా  కవిత పెట్టే పార్టీ వైపు వస్తారు.దీంతో కవితకు రాష్ట్రంలో ప్రిఫరెన్స్ పెరుగుతుందని ఆమె ప్లాన్లు వేసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: