తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి.. జూబ్లీహిల్స్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చింది. ఇదే సందర్భంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మంచి రిజల్ట్ వస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఎలక్షన్స్ పై పూర్తి కసరత్తు చేసింది.డిసెంబర్ రెండో వారం నుంచి ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అలాంటి ఈ సమయంలో బీసీలకు 42%  రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్స్ కి వెళ్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ బిల్లుపై ఆమోదం తెలుపకపోవడంతో ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వల్లే బీసీ రిజర్వేషన్ రావడం లేదని వాళ్ళు అడ్డుకుంటున్నారని ఒక అపవాది తీసుకొచ్చింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున 42 శాతం రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది. 

అయితే ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకువచ్చే ఒక వ్యూహం అని కూడా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ అందిస్తే బీజేపీ, బీఆర్ఎస్ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వాలి. ఒకవేళ ఇందులో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గితే మాత్రం దాన్ని భారీగా ప్రచారం చేసి ఆ కోణంలో ఓట్లు సాధించాలనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు కాంగ్రెస్ అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం,రైతులకు రెండు లక్షల రుణమాఫీ అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. అలాగే మహిళలు, రైతులు,బీసీ ఓటర్ల పై ప్రచారాలు ప్రభావం చూపుతాయని పార్టీ అంచనా వేసింది.

ఈ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే వ్యూహం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. కాంగ్రెస్ ఎలాంటి రిజర్వేషన్స్ ఇస్తుందో వేరే పార్టీలు కూడా అలాంటి రిజర్వేషన్ ఇచ్చి వారి అభ్యర్థిని నిలబెట్టాలి. అలాకాకుండా  మరొకరిని బరిలో ఉంచితే వారిపై ఒత్తిడి పెరిగి ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహం ముందు ఇతర పార్టీల నాయకులు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి పార్టీ పరంగా  రిజర్వేషన్ అందిస్తే, కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: