జగిత్యాల జిల్లాలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  అంటే తెలియని వారు ఉండరు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మేడిపల్లి సత్యం తాజాగా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. కొండగట్టులో పూజా కార్యక్రమానికి వెళుతున్నటువంటి ఎమ్మెల్యే కాన్వాయ్ ని ఎదురుగా వస్తున్నటువంటి మరో వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే వాహనాలు దెబ్బతిన్నాయి. పూడూరు మండువ సమీపంలోని బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం కారు ఆ బ్రిడ్జిని దాటి కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత కాన్వాయ్ లోని  వాహనాల్లో ఒకటి జగిత్యాల నుండి కరీంనగర్ కు వెళుతున్న టైం లో మరో కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 దీంతో ఆ కారు అదుపు తప్పాక పల్టీ కొట్టుతూ వెనుక వస్తున్న మరో వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ అన్ని హై రేంజ్ వాహనాలు కావడంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయి ఎవరికి ప్రాణాపాయం కలగలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సురక్షితంగా బయటపడ్డారు. మిగతా కార్లలో ఉన్నటువంటి వారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన ఎమ్మెల్యే నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది.

 హుటా హుటిన ఎమ్మెల్యే అనుచరులంతా మేడిపల్లి సత్యంను కలిసి ప్రమాదం గురించి తెలుసుకుంటున్నారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కూడా చేపడుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేకు మంత్రులకు హై సెక్యూరిటీ ఉంటుంది. వాళ్లు వాడే వాహనాలు కూడా హై రేంజ్ సెక్యూరిటీ కలిగినటువంటి వాహనాలే ఉంటాయి. ముందు వెనక కాన్వాయ్  ఉండడం వల్ల ప్రమాదాలు కూడా తక్కువనే జరుగుతాయి. అయితే సత్యంకు కూడా ఆ విధంగానే ముందు వెనుక కార్లు ఉండడం వల్ల పెద్దగా ప్రమాదం ఏమి జరగలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: