కొంత కాలం క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బీజేపీ మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఇక వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగింది. వైసీపీ పార్టీ వ్యతిరేక ఓటు ఏ మాత్రం చిలకుండా ఉండేందుకు తెలుగుదేశం , జనసేన , బీజేపీ కూటమి ఎంత గానో దోహదపడింది. దానితో ఈ కూటమి కి అద్భుతమైన స్థాయిలో ఓట్లు పడ్డాయి. అలాగే అదిరిపోయే రేంజ్ లో అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలు కూడా దక్కాయి. ఇక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఏవైనా పనులు చేసినా , పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న , పార్టీని ధిక్కరించిన కూడా బాబు ఈ మధ్య కాలంలో తెగ సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే నన్ను ప్రజలే గెలిపించారు అని వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కొన్ని రోజుల క్రితం తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు నన్ను ప్రజలు గెలిపించారు అనే వ్యాఖ్యలు చేశాడు. ఈయన తెలుగు దేశం పార్టీ సభ్యుడుగా పోటీలోకి దిగి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పార్టీతో సంబంధం లేకుండా నన్ను  జనాలు నన్ను గెలిపించారు అనే విధంగా మాట్లాడడంతో తాజాగా చంద్రబాబు ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు , కొలికపోడి శ్రీనివాసరావుకు పార్టీ అండ దండాలు లేకుండా గెలిచే సత్తా ఉంటే పార్టీ నుండి బయటికి వెళ్లి ప్రజాసేవ చెయ్యి , లేదంటే పార్టీ నుండి సీటు తీసుకోకుండా , పార్టీ సపోర్టు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరూపించాలి అని చంద్రబాబు , కొలకపూడి శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: