కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయ పోరు కొనసాగుతోంది. సీఎం సీటు కోసం ఇద్దరు ముఖ్య నాయకులు తీవ్రంగా కొట్లాడుతున్నారు.. ఓ వైపు సిద్ధరామయ్య సీఎంగా ఉండడంతో ఆయన పదవీ కాలం అయిపోయిందని నాకు సీఎం పదవి కావాలని డీకే శివకుమార్ ఇప్పటికే అధిష్టానాన్ని కలిసి పట్టుబడుతున్నారు. కానీ అధిష్టానం ఇద్దరికీ సమాధానం చెప్పలేక మీ ఇద్దరే తేల్చుకోండి అని చెప్పి వదిలేసింది. దీంతో ఇద్దరి లో ఎవరి బలం ఎంత ఉంది అనే దానిపై చర్చ సాగుతోంది. ఇదే సమయం లో సీఎం సిద్ధరామయ్య ను తప్పిస్తారనే ప్రచారం సాగుతూ ఉండడంతో ఆయన చాలా అలెర్ట్ అయ్యారు. హై కమాండ్ కు జలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

  ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే నేను వెంటనే బీజేపీ లో చేరి మళ్ళీ సీఎం అవుతాననే వార్నింగ్ కూడా ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా తనకు 140 ఎమ్మెల్యేలకు పైగా మద్దతు ఉందని ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా డీకే శివ కుమార్ సిద్ధరామయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పోరు జరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే ఈ పరిస్థితులు చూస్తే మాత్రం  వీరిద్దరి పోరు లో చివరికి బీజేపీ పార్టీ పదవి ని కొట్టుకుపోయే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ విధంగా కర్ణాటక లో సీఎం కుర్చీ కోసం ఇద్దరు నేతల మధ్య విపరీతమైనటు వంటి గొడవ జరుగుతుంది. దీంతో అక్కడి ప్రజలు  కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించాము రా అంటూ తలలు పట్టుకుంటున్నారు. పాలన ను గాలికి వదిలేసి  ఈ విధంగా ఇద్దరు పదవి కోసం గొడవలకు దిగడం  దారుణమని ప్రజలు విమర్శిస్తున్నారు. మరి చూడాలి కర్ణాటక రాజకీయం చిలికి చిలికి ఏ వైపు తిరుగుతుంది అనేది ముందు ముందు తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: