ఒకవైపు మార్చి, ఏప్రిల్లో పరీక్షలు రాబోతున్న తరుణంలో అప్పటిదాకా ఈ టీచర్ల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని అకాడమిక్ ఇన్స్ట్రక్చర్(విద్యా వాలంటిర్లు) పేరుతో కొత్తగా 1146 మందిని నియమించడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. సబ్జెక్టు టీచర్లు 892 మందిని నియమించి వీరి జీతం రూ .12,500 ,అలాగే ఎస్జిటి పోస్టులకు 254 మందిని నియమించి వీరి జీవితం రూ.10 వేల రూపాయలు ఉండనుంది. అయితే ఈ నెల 8 నుంచి మే 7వ తేదీ వరకు మాత్రమే విరు విధులలో ఉంటారట.
జనవరిలో ప్రతి ఏడాది కూడా డీఎస్సీ ప్రకటిస్తామంటూ నారా లోకేష్ ఇటీవలే నిరుద్యోగ టీచర్లుకు తెలియజేశారు. కొత్త టీచర్లు విధులలో చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది కాబట్టి ఈలోగా పాఠశాలలో విద్యార్థులు పరీక్ష సమయంలో బోధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఇలాంటి అకాడమిక్ ఇన్స్ట్రక్చర్ని తీసుకోవచ్చారు. ఈ నిర్ణయం మంచిదే అయిన.. వీరిని నియమించారు కదా అని జనవరిలో డిఎస్సి ప్రకటించే విషయంలో ప్రభుత్వం ఏదైనా కాలయాపన చేస్తుందేమో అని నిరుద్యోగ టీచర్లు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల మందు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామంటూ ఎన్నికలలో హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత తొలి సంతకం చేసిన కూడా ఈ నియామకమంతా పూర్తి అవ్వడానికి ఒక ఏడాది పైనే పట్టింది. ఇప్పుడు 2026 జనవరిలో డీఎస్సీ ప్రకటన రావాల్సి ఉంది.. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా మొత్తం నియామకాలను పూర్తి చేపట్టాలి. ఇప్పుడు విద్యా వాలంటిరీలతో ఆ పోస్టులను నియమించిన తక్షణ అవసరం ఏమీ లేదని, ఈ వాలంటిరీలను పునః నియామకం చేపడితే మాత్రం డీఎస్సీ నియామకాలు సాగదీత ధోరణిలో ఉంటాయని నిరుద్యో టీచర్లు భంగపాటుకు గురవుతున్నారు. మరి ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ ఎలా స్పందిస్తారో
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి