అంతేకాదు, బలమైన ఎంపీ అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా విజయం సాధించవచ్చని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే, మొత్తం 25 ఎంపీ స్థానాలకు సమర్థవంతమైన నేతలను వేటాడే పనిలో పార్టీ అధిష్టానం ఇప్పటికే నిమగ్నమైంది. రాజమండ్రిలో కీలక సందేశం: జగన్ వ్యూహంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం కీలకంగా మారింది. 2019లో బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు మార్గని భరత్‌ను ఎంపీగా పోటీ చేయించి విజయం సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో జరిగిన సీట్ల మార్పిడిలో భరత్ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, 2029 ఎన్నికల నాటికి భరత్‌కు జగన్ స్పష్టమైన సందేశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈసారి భరత్ కేవలం ఎంపీ సీటుకే పరిమితం కావాలని, అసెంబ్లీపై దృష్టి పెట్టవద్దని గట్టిగా సూచించనున్నారట.
మళ్ళీ పార్లమెంట్ మెట్లు ఎక్కాలనే ఆలోచన భరత్‌కు కూడా ఉన్నప్పటికీ, ఆయన అనుచరులు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ.. జగన్ మాత్రం ఆయన ఎంపీగా ఉండటమే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఈ తరహా బలమైన నాయకత్వాన్ని ఎంపీగా నిలబెట్టే వ్యూహాన్ని రాజమండ్రితో పాటు గోదావరి జిల్లాలలో మరికొంతమంది కీలక నేతలకు కూడా అమలు చేయాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద, 2029 ఎన్నికల్లో గత తప్పిదాలు పునరావృతం కాకుండా, గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చి, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి జగన్ సిద్ధమవుతున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త వ్యూహాలు వైఎస్సార్‌సీపీకి ఎంతవరకు విజయాన్ని అందిస్తాయో వేచి చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి