రాజకీయాల్లో గెలుపోటములు సహజమే.. కానీ కొంతమంది అనుకోకుండా అనహ్య పరిస్థితుల్లో ఓడిపోయి తలెత్తుకొని తిరగలేకపోతుంటారు.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన రాజకీయ అనుభవం ఉన్నంత వయసు కూడా లేని అమ్మాయి చేతిలో ఓడిపోయి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు.. ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం చక్రాలు వంగిపోయి కూర్చున్నాడు. అలాంటి ఆయన రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది ఎక్కడ ఓటమికి దారితీసింది అనే వివరాలు చూద్దాం.. ఎర్రబెల్లి దయాకర్ రావు 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.. ఆయన మొదటిసారి 1983లో శాసనసభ సభ్యుడిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 1987 లో వరంగల్ డిసిసిబి అధ్యక్షుడిగా పదవి వరించింది..

 ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. 1994లో మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. అలా 2004 వరకు వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించి  అదరహో అనిపించారు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో గొప్ప లీడర్ గా ఉన్న ఈయన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నిర్వీర్యం అయిపోవడంతో కాస్త నిరాశ చెందాడు. ఇక 2008లో ఉప ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసి రవీంద్ర నాయక్ ని ఓడించారు. అలా మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా వర్ధన్నపేట నుండి విజయం సాధించడమే కాకుండా , పాలకుర్తి నుంచి 2009, 2014,2018 ఎన్నికల్లో విజయాలు సాధించారు.

 అలా డబుల్ హ్యాట్రిక్ సాధించిన నేతల్లో ఈయన కూడా ఒకరు.. అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేసి, యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. యశస్విని రెడ్డికి కేవలం 26 సంవత్సరాలు మాత్రమే.. అలాంటి ఈమె తన తాత వయస్సు ఉన్న  ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించింది.. అయితే దయాకర్ రావు జీవితంలో ఇది దారుణమైన ఓటమి. దాదాపు 45 సంవత్సరాలకి పైగా రాజకీయాల్లో తిరుగులేని లీడర్ గా ఉన్నటువంటి ఈయన ఒక్కసారిగా కుప్పకూలాడు.. ప్రస్తుతం ఆయన  ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ వస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: