వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోసం మళ్లీ సంతకాల ఉద్యమం ప్రారంభమైంది. వైఎస్ మరణించినప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ సంతకాల సేకరణ చేపట్టిన జగన్ వర్గం ఈ సారి కేసులు ఎత్తివేసి, జగన్ ను జైలు నుంచి విడుదల చేయాలని 'జనం సంతకం' అనే పేరుతో ఉద్యమం చేపట్టారు. కోటి మందితో సంతకాలు చేయించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలన్నది వారి ఉద్దేశం. జనం సంతకం పేరుతో వైఎస్ఆర్ సీపీ నేతలు ఒక లేఖను విడుదల చేశారు.
జగన్పై రాజకీయపరంగా బనాయించిన కేసులను తీవ్రంగా గర్హిస్తున్నాం. జగన్ను దోషిగా చూపడానికి సిబిఐ అహర్నిశలూ చేస్తున్న ప్రయత్నాలు పరాకాష్టగా భావిస్తున్నాం. 200 రోజులుకు పైగా జగన్ను అక్రమ నిర్బంధంలో ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా జగన్పై కక్ష సాధింపు ఆపాలని కోరుతున్నాం. ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేస్తున్న విజ్ఞప్తి ఇది అని ఆ లేఖలో రాశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: