హైదరాబాద్: చాలా రోజుల తరువాత టీఆర్ఎస్ ప్రజల సమస్యలపై ఆందోళనలు చేపడుతోంది. ప్రభుత్వానికి లేఖల్ని రాస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి డెల్టా ప్రాంతానికి నీళ్లను వదలడంపై ఓ వైపు ఆందోళనలను చేపడుతోంది. మరోవైపు కరంటు కొరతలపై ధర్నాలు, రాస్తారోకోలను చేపడుతోంది. ఇంకోవైపు తెలంగాణ సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ లేఖల్ని రాస్తున్నారు. తెలంగాణ ప్రజల గొంతెండగొడుతూ డెల్టా ప్రాంతానికి సాగర్ నుంచి నీళ్లను వదలడంపై పోరాటం చేస్తోంది. నీళ్లను వదలడంపై తీవ్ర అభ్యంతరాలను తెలుపుతూ లేఖ రాశారు. తాజాగా తెలంగాణలో నెలకొన్న కరంటు సమస్యపై సీఎం కిరణ్కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖాస్త్రాన్ని సంధించారు. కరంటు కోతలతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు అదనపు కరంటును ఇవ్వకపోగా కరంటును ఎందుకు కట్ చేస్తున్నారంటూ లేఖ రాశారు. డెల్టా ప్రాంతానికి నీళ్లను ఇవ్వడానికి సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను ఎందుకు ఖాళీ చేస్తున్నారంటూ కేసీఆర్ లేఖను రాశారు. కేంద్రం నుంచి అదనంగా కరంటు తెప్పించాలంటూ కేసీఆర్ లేఖను రాశారు. చాలా రోజుల తరువాత ప్రభుత్వానికి కేసీఆర్ లేఖాస్ర్తాన్ని సంధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: