హైదరాబాద్: అక్రమ ఆస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ర్టపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో మే నెల 27న జగన్ను సీబీఐ అరెస్టు చేయడంతో అప్పటి నుంచి ఆయన చంచల్ గూడ జైలులోనే ఉంటున్నారు. బెయిల్ పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. అయితే, రాష్ర్టపతి ఎన్నికల్లో తనకు ఓటు వేసే అవకాశం కలిపించాల్సిందిగా జగన్ కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖను రాశారు. దానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. దీనితో జగన్ను గురువారం నాడు జైలు అధికారులు అసెంబ్లీ హాలులో ఏర్పాటు చేసిన రాష్ర్టపతి ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకువచ్చారు. ఓటు వేసిన అనంతరం జగన్ను నేరుగా జైలుకు తీసుకెళ్లారు. జగన్ రాక సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ తో పాటు జైలులోఉన్న రాష్ర్ట మాజీ మంత్రి మోపిదేవి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి