హైదరాబాద్: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు పరకాలలో తెరాస బహిరంగ సభను నిర్వహించనున్నది. తెరాస చీఫ్ కేసీఆర్ హాజరు కానున్న ఈ సభను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శుక్రవారం నాడు పరకాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తరుపున ఆ పార్టీ నాయకురాళ్లు విజయమ్మ, షర్మిలలు ప్రచారాన్ని నిర్వహించారు. వీరికి ప్రజలు ఊహించిన దానికంటే బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో శనివారం నాడు తెరాసతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా బహిరంగ సభలను నిర్వహించనున్నాయి. తెరాస సభకు కేసీఆర్ హాజరు కానున్నడంతో, బీజేపీ సభకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ వస్తున్నారు. ఈ రెండు పార్టీలు భారీగా జనాలు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: