హైదరాబాద్: మంగళవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పలు చోట్ల కొంత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 5గంటలకు ముగిసింది. పోలింగ్ జరిగిన అన్ని చోట్ల 70శాతం కు పైగాన పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా తరువాత కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఉదయం 8గంటల వరకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్-కాంగ్రెస్, టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు దిగారు. నెల్లూరులో సెజ్ బాధితులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మావోయిస్టుల పిలుపు మేరకు కూడా కొన్ని గ్రామాల్లో పోలింగ్ కు దూరంగా ఉన్నారు. రాయచోటి, రైల్వేకోడూరులో కూడా స్వల్ప ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పరకాలలో పోలీసుల అత్యుత్సహం వల్ల ఓటర్లు తిరగబడ్డారు. పోలీసుల లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. దీనికి ప్రతీకంగా ఓటర్లు పోలీసు వాహనాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు. అళ్లగడ్డలో విధినిర్వహణల ఉన్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ వడదెబ్బతో చనిపోయారు. ఒంగోలులో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు సిబ్బంది ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనీ విధుల నుంచి తప్పించారు. నెల్లూరు కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డిపై ఎన్నికల కమషన్ కు ఫిర్యాదు అందింది. మాచర్ల పోలింగ్ కేంద్రంలో వెబ్ వైరు తొలగడంతో ఎన్నికల కమిషన్ హై అలర్ట్ను ప్రకంటింది. మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది 

మరింత సమాచారం తెలుసుకోండి: