ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవి కోసం విపరీతమైన డిమాండ్ ఉండేది.  ఇప్పుడు ఆ పదవిని ఇస్తామన్నా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి.  గత ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ తన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనీ అనుకున్నాడు.  దానికి తగ్గట్టుగానే రాజీనామా చేయాలి సంకల్పించుకుంటే.. 


పార్టీ నేతలకు మాత్రం ససేమిరా అంటున్నారు.  కారణం ఏంటి..? ఎందుకు రాజీనామాను ఒప్పుకోవడం లేదు అన్నది తెలుసుకోవాలి.  రాహుల్‌ మాత్రం తన నిర్ణయంపై ఎక్కిన మెట్టు దిగేలా కనిపించడం లేదు. తాజాగా సీనియర్లతో జరిగిన సమావేశంలో రాహుల్‌ మళ్లీ తన ప్రతిపాదనను లేవనెత్తారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాల్సిందిగా పార్టీ సీనియర్లైన ఏకే ఆంటోనీ, వేణుగోపాల్‌ రావులను కోరగా వారు విముఖత చూపారు. 


నిన్న మొన్నటి వరకు తనకు అధ్యక్ష బాధ్యతలు కావాలని నోరు తెరిచి అడిగిన మరో సీనియర్‌ నేత షేర్‌ ఖాన్‌ సైతం ఇప్పుడు గుమ్మనంగా ఉన్నారు. అప్పట్లో కావాలని అడిగిన వ్యక్తులు కూడా వద్దని చెప్పడం విశేషం.   పార్టీ బాధ్యతలు ఈ సమయంలో తీసుకుంటే బుక్ అవుతామేమో అని భయపడుతున్నారు. 


అయితే, రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించకుండా.. సీనియర్ నేతను తాత్కలిక నాయకుడిగా నియమించడం, కాంగ్రెస్‌ పార్లమెంటరీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒకరు, రాహుల్‌ గాంధీకి సలహాలు, సూచనలు అందించడానికి మరొకర్ని నియమించే విషయమై ఈ సమావేశంలోని నిర్ణయం తీసుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: