ఏపీ రాజకీయాల్లో అసహనం పెరిగిపోతోంది.. మీడియా సమావేశాల సమయంలో అగ్రనేతలు కూడా సంయనం కోల్పోతున్నారు. అధికారం కోల్పోయిన ఫస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబులో ఇది ఓ పాలు ఎక్కువే కనిపిస్తోంది. తాజా ఆయన ఓ ప్రెస్ మీట్ లో సీఎం జగన్ ను ఏకవచనంతో సంబోధించడం వివాదమవుతోంది.


చంద్రబాబు వైఖరిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబులో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి లేవని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు, సత్యదూరపు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అవుతున్నారు. ముఖ్యమంత్రిని ఏక వచనంతో మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా మాట్లాడే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీస్తున్నారు. చంద్రబాబులో హుందాతనం కనిపించడం లేదన్నారు. చంద్రబాబు మాటల్లో కడుపు మంట తప్ప వాస్తవాలు కనిపించడం లేదన్నారు.


రోజు ప్రజల కోసం ఆలోచిస్తూ..రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేతల ఆరోపణలు సరికాదని హితవు పలికారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వైయస్ జగన్‌ వాటిని అధిగమిస్తూ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.


దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు విధానాలను ప్రజలు తిరస్కరించారని, ఇప్పటికైనా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు.. ఈ ఐదేళ్లలో అమరావతిలో పర్మినెంట్‌గా ఒక కట్టడమైనా కట్టారా అని ప్రశ్నిస్తున్నారు.


రాజధానిలో అన్నీ కూడా తాత్కాలికమే.. అందులో కూడా భారీగా దోపిడీకి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజలు అవకాశం ఇస్తే ఎందుకు శాశ్వతమైన నిర్మాణాలు కట్టలేకపోయారని నిలదీశారు. రూ.1.65 లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చారని వైసీపీ నేతలు అన్నారు. అది కాకుండా ప్రజలు మిమ్మల్ని అధికారంలో నుంచి తొలగించిన నాటికి రాష్ట్రంలో బకాయిలు పెట్టారని తెలిపారు. చంద్రబాబు మాట్లాడేవి అన్ని కూడా అబద్ధాలే అని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: