హైదరాబాద్: డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదంటూ క్యాట్ తీర్పునిచ్చింది. సీనియార్టీని కాదనీ దినేష్ రెడ్డిని డీజీపీ నియమించారంటూ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతంకుమార్ గత 8నెలల కిందట క్యాట్ను ఆశ్రయించారు. దినేష్ రెడ్డి కంటే ముందుగా తనకు డీజీ హోదాను కలిపించారనీ, సీనియార్టీని కాదనీ దినేష్ రెడ్డిని డీజీపీగా నియమించడం చెల్లదంటూ గౌతంకుమార్ క్యాట్లో ఫిటీషన్ వేశారు. దీనిపై క్యాట్ మంగళవారం నాడు డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా కొత్తగా మరో డీజీపీని నియమించుకోవాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఇదిలా ఉంటే క్యాట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: