మనం ప్రతిరోజు చూస్తున్న, వింటున్న మాటలు నిజమని తెలిసినప్పటికీ, మనలో చాలామంది ఈర్ష్య , ద్వేషాలతో నిండిపోయి, ప్రతి ఒక్కరి ప్రేమానురాగాలను దూరం చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నారు.. అయితే ఎంతో మంది ఎన్నో నిజాలను ఒప్పుకుంటే తప్పా , మనం జీవితంలో సంతోషంగా బ్రతకలేము.. అయితే నిజం అని తెలిసినప్పటికీ ,ఆ నమ్మలేని నిజాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం..
జననం ధర్మమనీ, మరణం తప్పదని అందరికీ తెలుసు. అయితే 50 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు మహా అయితే ఎనభై సంవత్సరాలు అంతకుమించి ఎవరు ఈ భూమి మీద ఉండరు అన్న నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..
ఖాళీ చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాము ..అలాగే ఖాళీ చేతులతోనే భూగర్భంలోకి పోతాము. ఇక తొలి స్నానం గుర్తులేదు , చివరి స్నానం తెలియదు.. కాబట్టి ఏది మనది కాదు. ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా జీవించడమే ఉత్తమం..
జ్ఞానం ఉన్న వారితో వాదించు , ఓడినా జ్ఞానం వస్తుంది. కానీ అజ్ఞానితో వాదిస్తే మనకున్న జ్ఞానం కూడా పోతుంది. మొదటగా ఇతరులతో వాదించడం మానుకోవాలి.
ఈ ప్రపంచమంతా అవకాశవాదులతో నిండి ఉంది. ఎవరు ఎప్పుడు ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి.
మనం ఎంత మంచి వాళ్ళు గా ఉన్నప్పటికీ ,ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్ళమే.. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కంటే, మనం మనలాగా బ్రతకడమే మంచిది .
మన దగ్గర డబ్బు లేకుంటే మన రక్తసంబంధం లోనే మనకు విలువ ఉండదు .ఇక అలాంటిది సమాజం ఎలా విలువ ఇస్తుందని అనుకుంటారు..
నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ,నువ్వు బ్రతికి ఉన్నావని అర్థం. అదే ఇతరుల నొప్పిని కూడా నువ్వు గ్రహించగలిగితే నీలో మానవత్వం ఉందని అర్థం.
మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఎప్పుడూ ఆలోచించకండి ..ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ వెనకే ఉంటుంది కాబట్టి..
ఎదురుగా ఉన్నప్పుడు నిన్ను ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు ,నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలుపెడతారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి