ఒకానొక సమయం లేదా సందర్భంలో మనలో తప్పకుండా చెడు అలవాట్లు లేదా చెడు ఆలోచనలు మొదలవుతాయి. అలా వచ్చినప్పుడు మనకు తప్పకుండా తెలుస్తుంది. ఏది మంచి..? ఏది చెడు..? అని తెలుసుకోవాలి.. అలా మనకు తెలిసిన రోజున వెంటనే వాటిని తుడిచి వేయడం మంచిది. చెడు ఆలోచనలకు లేదా చెడు అలవాట్లకు బానిస అయితే మాత్రం జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం.


ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గర్లో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ..నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. అతనికి దగ్గరలో ఉన్న నాలుగు మొక్కలను చూచాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు పుడుతున్న చిన్న ముక్క. ఇక రెండవది కొంచెం పెద్ద మొక్క .మూడవది దానికన్నా కొంచెం పెద్ద మొక్క. నాలుగవ అతి పెద్ద చెట్టు. గురువుగారు శిష్యుడిని చూసి ఆ చిన్న మొక్కను లాగేయమని చెప్పాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ అలాగే చేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంచెం కష్టపడి దానిని కూడా లాగేసాడు. మూడవ దానిని కూడా లాగమన్నాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే దానిని లాగడానికి తన శక్తినంతా ఉపయోగించి , కష్టపడి లాగేసాడు. బాగా ఎదిగిన చెట్టును కూడా చూపించి దానిని కూడా లాగేయమని గురువుగారు చెప్పారు. ఇక ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ తన రెండు చేతులను కూడా వేసి  ఎంత ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేక పోయాడు.

అయినా ఆపకుండా ప్రయత్నం చేస్తున్న కుర్రాడితో.. గురువుగారు.. చూడు నాయనా..! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లకు బానిస అయితే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా.. అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది.ఎంత ప్రయత్నించినా ..? ఆ పాత అలవాట్లు మనల్ని వదిలి పోవు అన్నాడు గురువుగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: