అనగనగా ఒక అడవి వుండేది. ఆ అడవిలో చిరుత పులి, సింహం కలిసి ఉండేవి. ఆ రెండింటికి వయసైపోవటంతో పెద్దగా వేటాడ లేకపోయేవి. ఉన్నదాంట్లోనే ఏవో ఒకటి తిని సర్దుకుపోయేవి. ఒకసారి వాటికి ఒక వారం రోజులపాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికి ఒక జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం.. మిత్రమా ..! మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు సరిగ్గా చిక్కటం లేదు. ఈసారి ఇద్దరం కలిసి చెరోవైపు నుండి దాడిచేద్దాం. అని చెప్పింది .దానికి చిరుతపులి సరే అంది. రెండూ కలిసి తెలివిగా వేటాడడం తో జింకపిల్ల దొరికిపోయింది.


దాంతో చిరుత పులి , సింహం సంతోషానికి అవధులు లేవు . అయితే సింహం ఇలా అన్నది..నాకు  మాత్రమే  కలసి వేటాడాలి అన్న మొదట భావన వచ్చింది . అందుకే ముందు నేనే తింటాను. అంది.. దాని మాటలకు చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నది చిన్న జింకపిల్ల , ముందు నువ్వే  తింటే , ఆ తర్వాత నేనేం తినాలి. ఇద్దరం కలిసే వేటాడడం కలిసి తిందాం. అనిచెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు. మాటా మాటా పెరిగింది.

అసలు నీకు వాటానే ఇవ్వను నేనే తింటా పో అని ఉరిమింది చిరుత . ఈ గొడవంతా చెట్టు చాటు నుండి ఒక నక్క గమనించింది. అసలే వృద్ధాప్యం ..ఆపైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు మృగాలు , ఎక్కువ సేపు పోట్లాడు కోలేవన్న విషయం దానికి అర్థమయ్యింది. గొడవ పడి పడి అలసిపోయి సింహం , చిరుత ఒక చోట కూల బడ్డాయి. అదే అదును అని అనుకున్న నక్క గబాలున లాక్కొని పోయింది. అయ్యో కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధ పడ్డాయి సింహం ,చిరుత పులి..

చూశారు కదా మనిషికి సహనం అనేది ఎంతో ముఖ్యం. ఎప్పుడైతే సమాధానాన్ని కోల్పోతాడు వివేకాన్ని కూడా కోల్పోతాడు. కాబట్టి ఇకమీదట మీ సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: