సూర్యగిరి మహారాజు జయంతుడు కొడుకు .. సీతాపురంలోని గురుకులంలో సకల విద్యలూ అభ్యసిస్తున్న యువరాజు దిలీపుడు, తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు. గురుకులం నుంచి కోటకు చేరుకునే మార్గంలో కొంతదూరం వాగులూ, వంకలూ ఉండడం వల్ల రాజు యువరాజు కోసం పల్లకిని పంపి వాటిని దాటి రోడ్డు మీదకు వచ్చాక ప్రయాణించడానికి రధాన్ని ఏర్పాటు చేశారు. దిలీపుడు ప్రయాణానికి సిద్ధమై గురువు కోసం వేచి చూస్తుండగా ఆయన భార్య మీ గురువుగారు పని మీద బయటకు వెళ్లారు. అని చెప్పింది.. ఆమె పాదాలకు నమస్కరించి పల్లకి ఎక్కాడు దిలీపుడు..

కొద్ది దూరం వెళ్ళాక దారి పక్కన ఓ ముసలాయన గాయాలతో పడి ఉన్నాడు. మా తాతను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి కాపాడండి. అని వేడుకోసాగాడు ఓ బాలుడు. యువరాజు పల్లకి దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి మిగతా భటులను సాయం పట్టమని పల్లకిలో పడుకోబెట్టాడు. తను నడుస్తూ పల్లకిని ముందుకు పోనియ్య మన్నాడు. యువరాజా! మీరు ఈ ఎండలో వాగులు వంకల్లో నడవలేరు. అన్నాడు ఒక భటుడు.. కాస్త దూరానికే కంది పోనులే అని నడవసాగాడు దిలీపుడు..

 కొంచెం దూరం వెళ్ళాక అక్కడ సిద్ధంగా ఉన్న రథంలో ముందుగా ముసలి వ్యక్తిని ఎక్కించి తర్వాత దిలీపుడు ఎక్కాడు.. మన కోట కంటే ముందే వైద్యశాల వస్తుంది. కదా ఈ తాతకు చికిత్స చేయిద్దాం. అని యువరాజు రథసారథికి చెప్పాడు. వైద్యశాలకు చేరుకోగానే ముసలి వ్యక్తి తన మారువేషం తొలగించాడు. దిలీపుడు నివ్వెరపోయి.. గురువుగారు మీరా? అన్నాడు .. అవును నిన్ను పరీక్షించడానికే నేను ఈ నాటకం ఆడాను.. పాలకులకు పల్లకి ఎక్కే అర్హతే కాదు.. దాన్ని మోసే సుగుణమూ ఉండాలి. నువ్వు గురుకులంలో నేర్చుకున్న విద్య సార్థకమైంది. అన్నాడు గురువు.. చిరునవ్వుతో మీరు నేర్పిన మంచి విషయాలు ఎప్పటికీ మరువను గురువుగారూ అని ఆయన ఆశీస్సులు అందుకున్నాడు దిలీపుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: