ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండగా ఇటీవల వన్డే సిరీస్ ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి  సిరీస్ చేజార్చుకున్న టీమిండియా జట్టు చివరి మ్యాచ్ లో మాత్రం ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో ఏకంగా భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీ తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ తన కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.


 అయితే ఇలా వన్డే ఫార్మాట్లో ఎవరైనా ఆటగాడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు అంటే చాలు ఐసీసీ విడుదల చేసే ర్యాంకింగ్స్ లో అతని స్థానం మరింత మెరుగవుతూ పైపైకి ఎగబాకుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో 126 బంతుల్లో డబుల్ సెంచరీ చేసి వీర విహారం చేసిన ఇషాన్ కిషన్ రాంక్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహకందని విధంగా ఇషాన్ కిషన్ ర్యాంక్ మెరుగుపడింది అని చెప్పాలి.


 ఏకంగా ఒకేసారి 100 స్థానాలు ఏగబాకి దూసుకు వచ్చాడు ఇషాన్ కిషన్. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ఒకేసారి 117 స్థానాలు ఏగబాకిన ఇషాన్ కిషన్ 37వ స్థానంకి దూసుకు వచ్చాడు అని చెప్పాలి. ఇక సెంచరీ తో చెలరేగిపోయి తన కెరీర్లో 72వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ సైతం రెండు స్థానాలు మెరుగుపరచుకొని ఎనిమిదవ స్థానంలోకి వచ్చేసాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 9వ స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఇక ఈ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: