
సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి స్టేడియం నుంచి ఇక మైదానంలోకి దూసుకొచ్చిన ప్రేక్షకులు తమ అభిమాన ఆటగాళ్లను కలవడం లాంటివి చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఇక విరాట్ కోహ్లీని కలవడానికి ఒక అభిమాని మైదానంలోకి వచ్చిన వీడియో వైరల్ గా మారిపోయింది. రాయిపూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో కూడా ఇలాంటి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత ఇన్నింగ్స్ పదో ఓవర్లో నాలుగో బంతిని రోహిత్ శర్మ ఆడిన తర్వాత ఒక అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు.
ఈ క్రమం లోనే కెప్టెన్ రోహిత్ శర్మను వేగం గా దూసుకు వచ్చి కౌగిలించు కున్నాడు. అయితే అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీంతో సదరు అభిమానిని మైదానం నుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే సదరు అభిమాని రోహిత్ శర్మను గట్టిగా పట్టుకోవడంతో ఇక సెక్యూరిటీ సిబ్బంది లాగిన దాటికి హిట్ మాన్ కూడా కింద పడిపోబోయాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. అతను కుర్రాడు మాత్రమే పాపం వదిలేయండి అంటూ హిట్ మ్యాన్ చెప్పడం గమనార్హం.