సాధారణంగా టి20 ఫార్మాట్  అంటేనే అటు సిక్సర్లు, ఫోర్ లకి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ ప్రేక్షకులు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే కావాలని కోరుకుంటారో.. బ్యాట్స్మెన్లు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తే చూడాలని అనుకుంటారో.. ఇక అలాంటిదే టీ20 ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటుంది. క్రీజ్ లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి పోవాల్సి ఉంటుంది. మొదటి బంతి నుంచే ఇక ఇలాంటి విధ్వంసం కొనసాగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఆట తీరే అటు టి20 ఫార్మాట్ కి ప్రపంచ క్రికెట్లో అంతకంతకు క్రేజ్ పెరిగిపోయేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.



అయితే సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే ఇక ఇలాంటి బ్యాట్స్మెన్ల విధ్వంసం చూడవచ్చు. ఇక బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ విధ్వంసం మరింత రెట్టింపు అవుతూ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఉండే ప్రత్యర్ధులు ఐపీఎల్లో సహచరులుగా మారిపోయి క్రికెట్ ఆడుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ఇక బ్యాట్స్మెన్ సృష్టించే విధ్వంసం ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజాని పంచుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల  ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వార్ వన్ సైడ్ అన్న విధంగా మారిపోయింది.



 ముంబై ఇండియన్స్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్ నేహాల్ వదెరా కొట్టిన సిక్సర్ మాత్రం చాలా కాస్లీగా మారిపోయింది. ఏకంగా ఒక్క సిక్స్  ఖరీదు ఐదు లక్షల రూపాయలు అని చెప్పాలి.. ఎందుకంటే ప్లేయర్లకు బహుమతిగా ఇచ్చేందుకు నిలిపిన టాటా టియాగో కారు డోర్ హ్యాండిల్ కు వదేరా కొట్టిన సిక్సర్ తాకింది. దీంతో హ్యాండిల్ దగ్గర డెంట్ ఏర్పడింది. అయితే ఇలా ఏదైనా సిక్స్ కారుకు తగిలింది అంటే చాలు ఐదు లక్షల రూపాయలను టాటా కంపెనీ కర్ణాటకలో కాఫీ మొక్కల పెంపకానికి డొనేట్ చేస్తూ ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl