జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరికి అప్పగించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మేరకు ఒక సంచలన ప్రకటన కూడా చేశారు పవన్ కళ్యాణ్. అసలు ఎవరు రాయ్?. పార్టీ సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి హోదా ఇవ్వడంతో కార్యకర్తలు, నేతలు ఈ నిర్మాత గురించి తెగ వెతికేస్తున్నారు. మరి రామ్ తాళ్లూరికి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వాటి గురించి చూద్దాం.


ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు చూస్తున్న వ్యవహారాలను ఇకమీదట నిర్మాత రామ్ తాళ్లూరి చూస్తారు. జనసేన పార్టీ ఐటి విభాగాన్ని ఈ నిర్మాత చూసుకోబోతున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో రామ్ కలిసి పనిచేస్తున్నారు. అప్పటినుంచి ఎటువంటి అపేక్ష లేకుండా పార్టీ కోసం పని చేశారు  రామ్ . అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నారు.పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పై నిర్మాత రామ్ కూడా ఆనందాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసిన రోజు నుంచే ఆయన అడుగుజాడలలో నడవడానికి సిద్ధమయ్యాను ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు చాలా ఉత్సాహంగా ఉందంటూ తెలిపారు. జనసేన పార్టీ తెలంగాణ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారట.


నాగబాబు పార్టీ వ్యవహారాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారని ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అటు జనసేన వర్గాలలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో జనసేన పార్టీ విస్తరింపజేసేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని అందుకే రామ్ ను కార్యదర్శిగా ఎంపిక  చేశారనే విధంగా వినిపిస్తున్నాయి. రామ్ తూళ్ళూరి ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన ఎన్నారై.. ఈయన సినిమాలు కూడా నిర్మిస్తూ ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులలో ఈయన కూడా ఒకరు. రామ్ అమెరికాలో లీడ్ ఐటీ కార్ప్, ప్లై జోన్ ట్రామ్పోలిన్ పార్క్, రామ్ రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలను కూడా నడుపుతున్నారు అంతేకాకుండా ఇండస్ట్రీలో SRT ఎంటర్టైన్మెంట్ పతాకంపై కూడా పోలీస్ సినిమాలను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: