వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి అన్నాడని కాదు కానీ చంద్రబాబునాయుడు చేష్టలన్నీ దాదాపుగా అలాగే ఉన్నాయి.  ప్రతిరోజు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టటం, నేతలతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించటం, డాక్టర్లతో వీడియా కాన్ఫరెన్సులో మాట్లాడటం లాంటి చేష్టలతో చంద్రబాబుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.  మామూలుగా అధికారంలో ఉండగా ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు చంద్రబాబు దినచర్య పైన చెప్పినట్లుగానే ఉండేది. నిజంగా అప్పుడు అధికారులకు చాలా హింసగా ఉండేదనటంలో సందేహమే లేదు.

 

సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోరమైన ఓటమి ఎదురైంది. ఎన్నికల్లో ఓడిపోయి పది మాసాలైనా చంద్రబాబు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి పై ప్రతిరోజు నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. అలవాటై ప్రాణం కదా అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా సుమారు గంటన్నరకు తక్కువ లేకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాడు.

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే కరోనా వైరస్ సంక్షోభంలో కూడా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తునే ఉన్నాడు.  మీడియా సమావేశాల్లో కూడా కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఏమి చెప్పింది, ప్రపంచ దేశాధినేతలు ఏమన్నారు, నిపుణులు ఎటువంటి సూచనలు పాటిస్తున్నారనే విషయాన్ని వీడియోల్లో పదే పదే చూపించి చావగొడుతున్నాడు. వీటికన్నటికీ పరాకాష్ట ఏమిటంటే నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటం. ఇవన్నీ చేసి ఏమి చేస్తాడయ్యా అంటే ఏమీ లేదు.

 

ఈ విషయాలన్నీ చూసిన తర్వాతే బహుశా విజయసాయి చంద్రబాబుపై సెటైర్లు వేశాడు ట్విట్టర్లో. ’ సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీకి ఫోన్ కలుపు, ఏపీ సీఎస్ ను మాట్లాడమను, హెల్త్ సెక్రటరీ రిపోర్టేది ? తక్షణం మీడియా కాన్ఫరెన్సు అరేంజ్ చేయండి’ అని చంద్రబాబు ప్రతిరోజు పలవరిస్తున్నాడంటూ విజయసాయి ఎద్దేవా చేశాడు. ఎందుకు పలవరిస్తున్నాడంటే చంద్రబాబు మానసిక పరిస్ధతి దిగజారిపోయిందట. కరోనా తీవ్రత తగ్గేలోగా చంద్రబాబుకు సీరియస్ అయిపోతుందని అందరూ భయపడుతున్నారంటూ ఎంపి గాలి తీసేశాడు.

 

చంద్రబాబు పరిస్ధితి ఎలాగుందంటే జగన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏమీ తీసుకోవటం లేదని బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు.  ఏపిలో కన్నా కేసులు తవ్రత ఎక్కువున్న రాష్ట్రాలు చాలానే ఉన్నా  మన రాష్ట్రంలో మాత్రం వైరస్ థర్డ్ స్టేజిలోకి వెళ్ళిపోవటానికి జగన్ చేతకాని తనమే అని పదే పదే ఆరోపిస్తున్నాడు. ఎలాగైనా జగన్ పై జనాలను రెచ్చగొట్టాలన్న తాపత్రయమే కనబడుతోంది చంద్రబాబు ఆరోపణల్లో. అందుకనే విజయసాయి ట్విట్టర్ ద్వారా గాలి తీసేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: