చంద్రబాబునాయుడుకు విశాఖ ఉత్తరం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు భలే సమస్యగా తయారయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కనబడటం లేదు. పార్టీ నేతలతో పెద్దగా టచ్ లో ఉండటం లేదు. అధినేత చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్సులు, జూమ్ కాన్ఫరెన్సుల్లో కూడా ఎక్కడా కనబడటం లేదు, వినబడటం లేదు. హోలు మొత్తం మీద పార్టీతోనే గంటా టచ్ లో ఉండటం లేదు. దాంతో అసలు ఎంఎల్ఏ టీడీపీలోనే ఉన్నారా లేదా అన్నది చివరకు చంద్రబాబుకు కూడా అనుమానంగానే తయారైంది. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ చేరబోతున్నట్లు ఓ వందసార్లయినా ఇప్పటికి ప్రచారం జరిగుంటుంది. అయితే అది కూడా జరగలేదు. దాదాపు జనజీవన స్రవంతికి దూరంగానే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా తెరమీదక వచ్చేసి నానా హడావుడి చేసేస్తున్నారు.
జవజీవన స్రవంతిలోకి గంటాను తీసుకొచ్చిన ఖ్యాతి మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకే దక్కుతుంది. ఎప్పుడైతే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిందో వెంటనే గంటా రంగంలోకి దూకేశారు. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. సరే ఇఫ్పటికి మూడుసార్లు రాజీనామా చేశారనుకోండి అది వేరే సంగతి. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుతో సహా యావత్ పార్టీ నేతలంతా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే గంటా మాత్రం ప్రైవేటీకరణ పాపంలో టీడీపీకి కూడా పాత్రుందంటు పెద్ద బాంబే పేల్చారు. పార్టీలైనుకు భిన్నంగా ఎవరూ మాట్లాడద్దని చంద్రబాబు స్పష్టంగా చెప్పినా ఎవరితోను చెప్పకుండా తనంతట తానే రాజీనామా చేసేశారు.
మొత్తానికి తన వైఖరితో చంద్రబాబుతో పాటు చాలామంది తెలుగుదేశంపార్టీ నేతలు బాగా ఇబ్బంది పడుతున్నది వాస్తవం. ఉక్కు ఆందోళనలకు సంబంధించి వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనలు, రౌండు టేబుల్ సమావేశలంటు హడావుడి చేస్తుంటే టీడీపీ మాత్రం ఎవరితోను కలవకుండా సపరేటుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో కూడా గంటా వైసీపీ అండ్ కో పార్టీలు నిర్వహిస్తున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఆదేశాలకు భిన్నంగా సొంత అజెండాతో ముందుకెళిపోతున్నారు. దీంతో చంద్రబాబుకు గంటా పెద్ద సమస్యగా తయారయ్యారనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి