ఎవరైనా గెలిచిన వాళ్ళతో క్యాంపులు నిర్వహిస్తారు. కానీ తెలుగుదేశంపార్టీ మాత్రం నామినేషన్లు వేసిన వారితోనే క్యాంపులు నిర్వహించేస్తోంది. నామినేషన్లు వేసిన వారు క్యాంపులకు వెళిపోతే మరి ప్రచారం ఎలాగ ? ఇదే పార్టీకి ఇపుడు పెద్ద సమస్యగా తయారైంది. నామినేషన్లు వేసిన తమ అభ్యర్ధులు మళ్ళీ ఎక్కడ నామినేషన్లను ఉపసంహించుకుంటారో అనే ఆందోళన టీడీపీ సీనియర్లలో పెరిగిపోతోంది. అందుకనే వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం లేకుండా ఏకంగా క్యాంపులు మొదలుపెట్టేసింది. రాష్ట్రంలోని దాదాపు 32 మున్సిపాలిటిల్లో పోటీ చేయబోతున్న టీడీపీ అభ్యర్ధులతో అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో క్యాంపులు పెట్టేశారు. క్యాంపులకు తరలించిన వారి దగ్గర నుండి సెల్ ఫోన్లు కూడా తీసేసుకున్నారు. వారితో ఎవరినీ ఫోన్లో మాట్లాడనీయకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఒకవేళ కుటుంబసభ్యులతో మాట్లాడాలని అభ్యర్ధులు అనుకుంటే అప్పుడు క్యాంపుల ఇన్చార్జీలు తమ దగ్గరున్న మొబైల్ ఫోన్లతోనే మాట్లాడిస్తున్నారు. మొత్తానికి తమ రహస్య క్యాంపుల ఆచూకీ బయటకు పొక్కకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పోటీలో ఉన్న అభ్యర్ధులను కర్నాటక రాష్ట్రానికి తరలించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నామినేషన్లు వేసిన వారిని తమిళనాడు రాష్ట్రంలో క్యాంపులు పెట్టేశారు. కడప జిల్లాలోని చాలామంది అభ్యర్ధులను పాండిచ్చేరికి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోని మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసిన వారిని ఎక్కడకు వీలైతే అక్కడకు రహస్యంగా తరలించేశారు.
మొత్తానికి కోడిపిల్లలను గంపల కింద పెట్టుకుని యజమానులు ఎలా కాపాడుకుంటారో టీడీపీ కూడా తన అభ్యర్ధులను అలాగే కాపుడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్యాంపులు నిర్వహించటమన్నది టీడీపీ ఇపుడే కాదు. అధికారంలో ఉన్నపుడు కూడా తమ అభ్యర్ధులను ఇలాగే క్యాంపులకు తరలించింది. అప్పట్లో స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్ధానికసంస్ధల్లో వైసీపీకే మెజారిటి ఉంది. కాబట్టి పై జిల్లాల్లో గెలుపు అవకాశాలు కూడా వైసీపీకే ఉన్నాయి. కానీ టీడీపీ అభ్యర్ధులతో క్యాంపులు నిర్వహించింది. ఎందుకంటే వైసీపీ తరపున గెలిచిన ఓట్లనే లక్ష్యంగా పెట్టుకుని క్యాంపులు నిర్వహించింది. మొత్తానికి సామధానబేదాలు పాటించి పై జిల్లాల్లో టీడీపీ గెలిచింది. అప్పట్లో పై జిల్లాల్లో క్యాంపులు నిర్వహించకుండా ఫెయిర్ ఎలక్షన్ జరిపుంటే టీడీపీ ఓడిపోయేదే. మొత్తానికి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీకి క్యాంపులైతే తప్పటం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి