కేసీఆర్‌.. ఓ మాటల మరాఠీ.. ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. ఏం చెప్పదలచుకున్నా.. అది ఎలాంటి విషయం అయినా.. ప్రజలకు నిజమే కదా.. అనిపించేలా హత్తుకునేలా చెప్పగలిగిన వాగ్ధాటి, వాదనాపటిమ, భాష ఉన్న నాయకుడు. ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. కొందరు నేతలకు సబ్జక్ట్ ఉంటే.. ప్రజంటేషన్‌ ఉండదు.. కొందరికి ప్రజంటేషన్ ఉంటే సబ్జక్ట్ ఉండదు.. ఈ రెండు కలిగి..దాన్ని జనం భాషలో జనం మెదళ్లలోకి సూటిగా ఎక్కేలా చెప్పగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్.


కేసీఆర్‌ వాక్పటిమకు, వాదనా చాతుర్యానికి నిన్నటి కౌశిక్ రెడ్డి చేరిక సమయంలో చేసిన ప్రసంగం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే రీతితో హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం ఆ కోవలోనిదే. దళిత బంధు పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా రూ. 10 లక్షల రూపాయల నగదు ఇవ్వబోతున్నారు.


ఈ పథకం హూజూరాబాద్ ఎన్నికల కోసమే తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి చేరిక సమయంలో ఈ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. దళితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి అద్భుతంగా చెబుతూ... కొందరు దీన్ని ఎన్నికల కోసం తెస్తున్నామంటున్నారు.. కానీ.. అది నిజం కాదు.. అసలు ఇప్పుడు ఎన్నికలు ఏమున్నాయి.. ఎప్పుడో రెండేళ్ల తర్వాత ఎన్నికలు కదా.. అంటూ విపక్షాల ఆరోపణలను కొట్టి పారేశారు. అంత వరకూ బాగానే ఉంది. ఆ తర్వాత మరో పది నిమిషాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు.. వాటి నేపథ్యం, వాటి ఫలితాలు వివరించారు.


మళ్లీ టాపిక్ దళిత బంధుపైకి వచ్చింది.. అప్పుడు కేసీఆర్ విశ్వరూపం చూపించారు. దళిత బంధు రాజకీయ లబ్ది కోసం తెస్తున్నామంటున్నారు.. ఔను.. నిజమే.. రాజకీయ లబ్ది కోసం తెస్తే తప్పేంటి.. కష్టపడే వాడు ఫలితం కోరుకోవద్దా.. టీఆర్‌ఎస్‌కు రాజకీయ లబ్ది రావొద్దా.. మాది కూడా రాజకీయ పార్టీయే కదా.. టీఆర్ఎస్‌ ఏమైనా సన్నాసుల మఠమా.. రాజకీయ లబ్ది కోరుకుంటే తప్పేంటి.. అంటూ పది నిమిషాల క్రితం తాను చెప్పిన దానికి భిన్నంగా పూర్తిగా ప్లేటు ఫిరాయించేశారు.. గదమాయించేశారు.. దటీజ్‌ కేసీఆర్‌..


మరింత సమాచారం తెలుసుకోండి: