డా.ఎం. ప్రభాకర్ రెడ్డి.. సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని నటుడు. మొదట సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టి, ఆ తర్వాత విలన్ గా, చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుకోవడంతో పాటు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఈయన తన నటనతో ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ వంటి స్టార్ హీరోలకు దీటుగా విలన్ పాత్రలో నటించి, హీరోలకు చుక్కలు చూపించేవారు. ముఖ్యంగా ఈయన కోసమే కొంతమంది ప్రేక్షకులు సినిమాలు చూడడానికి వచ్చేవారు అంటే అది అతిశయోక్తి కాదు. అంతలా పాత్రలో లీనమైపోయి నటిస్తూ ఉంటారు ప్రభాకర్ రెడ్డి.

ఈయన తెలంగాణ రాష్ట్రం  నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి లో జన్మించారు. ఈయన తండ్రి పేరు లక్ష్మారెడ్డి తల్లి కౌసల్య. ఈయన తన ప్రాథమిక విద్యను సూర్యపేటలో పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత విద్య ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ లోని సిటీ కాలేజీలో చేరారు. ఇక తర్వాత వైద్య విద్య కోసం 1955వ సంవత్సరం నుండి 1960వ సంవత్సరం వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆయన వైద్య విద్యను పూర్తి చేశారు. మన సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అని చెప్పుకొచ్చారు.


కానీ హైదరాబాద్ లోని సూర్యాపేటకు చెందిన ప్రభాకర్ రెడ్డి మాత్రం డాక్టర్ అయ్యారు. అంతేకాదు ఒకే సంవత్సరంలో ని డాక్టర్ తో పాటు యాక్టర్ కూడా అయ్యారు. ఈయన కష్టపడి చదివి తన పేరు ముందు డాక్టర్ అని అర్హత పొందిన వ్యక్తి. ఇక ఇలా ఆయన డాక్టర్ చదువుతున్నపుడు యాక్టర్ అయ్యారు అంటే ఆయన తొలి సినిమా " చివరికి మిగిలేది" అనే సినిమాకు నటుడి పాత్ర కోసం అవకాశం వచ్చినప్పుడు, ప్రభాకర్ రెడ్డి ఎంబిబిఎస్ పరీక్ష రాస్తున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ లో ఆయన నటించారు.అయితే  ఈ సినిమా విడుదల అవ్వకముందే ఎంబిబిఎస్ రిజల్ట్స్ వచ్చి ఆయన డాక్టర్ అయ్యారు.

ఈయన హైదరాబాదులో ఒకపక్క డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూనే, మరో పక్క సినిమాల మీద ఆసక్తితో సినిమాలలో నటించే వారు. భీష్మ, తండ్రులు కొడుకులు వంటి చిత్రాలలో ఆయన నటించారు. ఇక సినిమా అవకాశాలు వస్తున్న సమయంలో డాక్టర్ కంటే యాక్టర్ అవ్వడమే తనకు మంచిదని, డాక్టర్ కోర్సును పక్కన పెట్టేసి యాక్టర్  అయ్యారు. అయితే  దురదృష్టవశాత్తు అవకాశాలు కోల్పోయి, డాక్టర్ ప్రాక్టీస్ లేక ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు ప్రభాకర్ రెడ్డి. ఇక ఆయనకు ఉర్దూ బాగా తెలిసి ఉండడం తో కొన్ని కవితలను కూడా రాశారు.


ఇక తర్వాత అదృష్టం కలిసి రావడంతో ఒక నెలలోనే ఏకంగా పది సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఇక అలా ఆయన తన సినీ స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు. ఆయన సినీ ప్రస్థానం లో 1980 - 81 సంవత్సరాలకు గాను యువతరం కదిలింది, పల్లె పిలిచింది వంటి సినిమాలకు గాను నంది అవార్డును అందుకోవడం విశేషం. 1991 లో చిన్న కోడలు చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. గృహప్రవేశం , గాంధీ పుట్టిన దేశం వంటి చిత్రాలకు ఉత్తమ రచయితగా కూడా నంది అవార్డులను గెలుచుకున్నారు. ఇక చివరిగా 1997 సంవత్సరంలో హైదరాబాద్ లోని  తన నివాసంలో స్వర్గస్తులయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: