దుర్గా దేవికి అంకితమివ్వబడిన ఈ పండుగను బెంగాల్ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. అలాగే కర్నాటకలోనూ మైసూరు ఉత్సవాలను దేశంలోనే అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కత్తాతో పాటు దేశంలోని చాలా చోట్ల దుర్గా దేవి దేవాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. నవరాత్రుల వేళలో తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ సుదీర్ఘమైన పండుగకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.