హోలీ ఈ పండుగలో తెలియని సంతోషం సంబరం దాగి ఉంది. ఈ పండుగను హిందూ పురాణాల ప్రకారం సత్య యుగం నుండి జరుపుకోవడం సంప్రదాయంగా వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం హోలీ పండుగ హిందువుల క్యాలెండర్ ప్రకారం పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీకి ముందు కాముని దహన కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాతి రోజే రంగులు చల్లుకుంటూ వేడుకగా జరుపుకుంటారు.