మహాకాళేశ్వర జ్యోతిర్లింగం… హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటిగా ఉంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో ఈ దేవాలయం ఉంది. "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉన్న ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు భక్తులు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. 

 

ఈవిగ్రహం ముఖం దక్షివైపు ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో "ఓంకారేశ్వర మహాదేవ" విగ్రహం మహాకాల విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి మరియు కార్తికేయుల చిత్రాలు పశ్చిమ,ఉత్తర మరియు తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. నంది మహాదేవుని యొక్క వాహనం అనే సంగతి తెలిసిందే. 

 

మూడవ అంతస్తులో గల "నాగచంద్రేశ్వర" విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనంకోసం తెలుస్తారు. ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొనివున్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉంది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి దారి చూపిస్తూ ఉంటాయి. ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. 

 

మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందు ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: