హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. సోమవారం శివునికి ఎంతో ప్రత్యేకమైన రోజు. వేదాలు లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెబుతాయి. శివునికి విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి మూడు ఆకులు గల బిల్వ పత్రాలు ఎంతో ఇష్టం. 
 
శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. శివునికి పూజ చెసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. సోమవారం రోజున శుభ్రమైన దుస్తులు ధరించి సూర్యోదయం సమయంలో శివుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శివుడికి చేసే సమయంలో తులసి ఆకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వినియోగించరాదు. 
 
ఇంట్లో శివలింగం పెట్టుకున్నవారు కచ్చితంగా జలధార ఉండేలా చూసుకోవాలి. జలధార లేకుండా శివ లింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం. వెలగ పండును సమర్పిస్తే దీర్ఘాయుష్షు సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివునికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోను కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివునికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: