ప్రపంచంలో కలిగియుగ దైవంగా భావించి భక్తితో కొలిచే దేవుడు సాయినాథుడు.  మనుషుల మద్య ఆయన జీవనం కొనసాగినా.. ఆయన మహిమల వల్ల ఎంతో మంది జ్ఞానోదయం పొందారు.  దేవుడు ఒక్కడే.. ఆయనే అల్లా మాలిక్ అంటూ కులమతాలు, జాతి విభేదాలు లేకుండా ఆయన భక్తులకు ఎన్నో బోధనలు చేశారు.  సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు, చీమ, దోమ, కుక్క, పులి అన్ని జీవరాశులనూ సమానంగా భావించేవాడు. బాబా బిక్షాటన చేసి వచ్చిన తర్వాత ఘన పదార్ధాలను ఒక పాత్రలో, ద్రవ పదార్థాలను ఇంకో పాత్రలో ఉంచేవాడు. 

 

సాయిబాబా ప్రతి మాట, ప్రతి చేష్ట మనిషిని, మహా మనిషిగా తీర్చి దిద్దేందుకు ఉపయోగపడేది. ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా ఉంటాయో, ఎంత స్పష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి... ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు. కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువులు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తరిమివేయొద్దు.

 

మన వద్దకు వచ్చినవారిని ప్రేమతో ఆదరించాలి. జంతువులు అయినా అంతే. సాదరంగా దగ్గరకు తీయాలి. కనికరం చూపించాలి. ఆప్యాయంగా ఆకలి తీర్చాలి అంటూ భక్తులకు బోధించారు.  ఇలా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే. నువ్వు ఇలా సహ్రుదయ౦తో ఉంటే, భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుడికి దగ్గరైనట్లే. ఇతరులకు మేలు చేసేవారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. తన కరుణాకటాక్షాలను ప్రసరింపచేస్తాడు అంటూ భక్తులకు ఆయన ప్రబోధ చేశారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: