తిరుమల శ్రీవారి దేవస్థానం.. రోజుకు లక్షమందికీపైగా శ్రీవారి దర్శనం చేసుకుంటారు.. అలాంటి శ్రీవారి దేవస్థానం ఈ కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా మూసేశారు.. ఇంకా ఈ లాక్ డౌన్ తో ఇన్నాళ్లు మూసుకుపోయిన శ్రీవారి ఆలయంపై.. శ్రీవారి దర్శనాల గురించి టీటీడీ ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్ తాజా ప్రకటన విడుదల చేశారు. 

 

IHG

 

ఇప్పటికే తిరుమల దర్శనాలు లేవు అని బాధ పడుతున్న భక్తులకు మరో షాకింగ్ వార్త తెలిసింది. అది ఏంటి అంటే ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మరో రెండు వారాల పాటు భక్తులకు దర్శనాలు ఉండవని అయన తెలిపారు. మే 17వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటి నిర్ణయాలు తీసుకుంటామని అనిల్ కుమార్ తెలిపారు.

 

IHG

 

అంతేకాదు లాక్‌డౌన్ ముగిసిన తర్వాత.. శ్రీవారి దర్శన విధానం, క్యులైన్లలో సోషల్ డిస్టెన్స్‌ వంటి అంశాలపై కసరత్తు చేస్తాం అని అన్నారు.. కాగా ఇప్పటికే సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చెయ్యడం.. మాస్కులు తప్పనిసరి ధరించడం అని వార్తలు వస్తున్న ఈ సమయంలో శ్రీవారి దర్శన విధానంపై కూడా కసరత్తు చేయనున్నట్టు చెప్పారు. 

 

IHG

 

కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుండి ఓపీ సేవలు ప్రారంభిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్ కార్మికులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కొత్త టెండర్లు కేటాయించే వరకు మరో నెల రోజులపాటు కాంట్రాక్ట్ గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: