సాధార‌ణంగా భారతీయ చరిత్రలో రామాయణం ఒక మర్చిపోలేని అధ్యాయం. ఇందులో ముఖ్యంగా హ‌నుమంతుని పాత్రను చాలా మంది ఆరాధిస్తారు. ఇక ఎవరికైనా భయం కలిగితే తన ఇష్టదైవాన్ని కూడా కాదని, ముందు ప్రార్థించేది హనుమంతుడినే. హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం వీటన్నింటి సమ్మేళనం హ‌నుమంతుడు. అందుకే హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే హనుమంతుడిని బ్రహ్మచారిగా పేర్కొంటారు. కానీ, సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడి తోకకు నిప్పంటించానికి రావణుడు ప్రయత్నించాడు. 

 

ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమ శ్వేధాన్ని ఓ చేప మింగి గర్భం దాల్చినట్లు ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఆ చేపకు జన్మించిన వాడే మకరధ్వజుడు. అతడినే ఆంజనేయుడి కొడుకుగా పేర్కొంటారు. అయితే పరాశర సంహితలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగినట్లు తెలిపారు. అంతేకాదు, సూర్యుడే హ‌నుమంతుడికి త‌న కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు. 

 

నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. అయితే వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చల దేవిని హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదు. ఎందుకంటే..  సువర్చల దేవ కన్య. ఆమెను వివాహం చేసుకున్నా హ‌నుమంతుడి బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఇక‌ వివాహం అయిన మరుక్షణమే సూర్య పుత్రిక తపస్సుకు ఉపక్రమించింది. దక్షిణ భారత దేశంలో సువర్చలదేవి పేరుతో ఈమె పూజలందుకుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిళ్లపల్లిలో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: