సినిమాను తెరకెక్కించడం కాదు, ఆ సినిమాను అభిమానులు కోరుకునే రేంజ్‌లో అందించడం, ఆ స్థాయికి తీసుకెళ్లడమే  నిజమైన విజయానికి అసలు అర్ధం. ఆ విషయంలో దర్శకుడు సుజిత్ 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా సరే, ప్రతి స్టార్ ఫ్యాన్ అయినా, ప్రతి సాధారణ ప్రేక్షకుడు అయినా ఒకే మాట చెబుతున్నారు – “ఓజీ గంభీర్”.ఈ సినిమాను డైరెక్టర్ ఎలాంటి ఆలోచనలతో తెరకెక్కించాడో తెలీదు కానీ, ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన హీరోను ఎలా చూడాలని అనుకుంటాడో, ఏ విధమైన సీన్స్‌లో నటించాలనుకుంటాడో, ఆ ఆలోచనలను సరిగ్గా అచ్చం అలాగే స్క్రీన్ మీద చూపించి, అభిమానుల అంచనాలకు 100% సాటిరాగా తీర్చిదిద్దాడు.

అచ్చం ఫ్యాన్స్ మైండ్‌లో ఉన్న హీరో పవర్‌ను, ఆ హీరో ఇమేజ్‌ను దర్శకుడు సుజిత్ సిల్వర్ స్క్రీన్‌పై రియాలిటీగా చూపించాడు. అందుకే ఇప్పుడు అభిమానులు మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఈ సినిమా గురించి మైండ్‌బ్లోయింగ్ టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా ప్రారంభం నుంచే ఊహించని రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఈ క్రేజీ రెస్పాన్స్‌ని చూసిన తర్వాత, సినిమా యూనిట్ ఈ విజయాన్ని మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఫైనల్‌గా డిసైడ్ చేసింది. అందుకే సక్సెస్ మీట్ ని భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ఈ సక్సెస్ ఈవెంట్ ఎక్కడ జరుగబోతుందనే అంశం మాత్రం పెద్ద సస్పెన్స్‌గా మారింది. కొందరు పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ప్లేస్‌లోనే ఈవెంట్‌ను నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అంత దూరం ట్రావెల్ చేయడం సాధ్యం కాదని, అందుకే హైదరాబాద్‌లోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇంకా మరో వైపు, ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా హాజరు కాబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అభిమానులు అయితే ఈ ఈవెంట్‌కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎగ్జైటెడ్‌గా ఫాలో అవుతున్నారు. “ఓజీ హిస్టారికల్ సెలబ్రేషన్స్” పేరుతో ఈ సక్సెస్ ఈవెంట్ జరుగుతున్నదే గొప్ప విషయమని, అది ఎక్కడ జరిగినా ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ మూడ్ కన్ ఫామ్ ఆనందంగా కామెంట్లు చేస్తున్నారు.

ఈవెంట్‌కు హాజరయ్యే వారిలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, దర్శకుడు సుజిత్,తమన్, ఇమ్రాన్, యశ్మీర్ రెడ్డి, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఉన్నారని సమాచారం. దీంతో ఈ సక్సెస్ సెలబ్రేషన్ ఒక హిస్టారికల్ ఈవెంట్ గా నిలవనుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: