అదేవిధంగా విఘ్నేశ్వరునికి కుడుములు, వెలగ పళ్ళు... అమ్మవారికి చక్కెర పొంగలి, పులిహోర ప్రీతికరమని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే మన హిందువులు కూడా వీటిని పాటిస్తూ ఆయా దేవుళ్ళకు ప్రత్యేక పండుగ నాడు వారికిష్టమైన నైవేద్యాలను చేసి సమర్పించి పూజలు నిర్వహిస్తారు. ఇలా దేవునికి నైవేద్యం పెట్టడం వలన పూజ అయ్యాక పూర్తి ఫలితం అందుతుందని వేద పండితులు అంటున్నారు. అయితే మిగిలిన రోజులలో సాధారణ నైవేద్యాలను సమర్పించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అరటి పళ్ళు, ఏదైనా పండు లేదా ఎక్కువగా చక్కెరను దేవునికి నైవేద్యంగా పెట్టి నిత్య పూజలు చేస్తుంటారు.
ఇలా దేవునికి చక్కెర నైవేద్యంగా పెట్టరాదని కొందరు అంటుంటారు. కానీ ఏ దేవుని కైనా చక్కెర నైవేద్యంగా పెట్టడం దోషమేమీ కాదని మన వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు మనం చేసే ఏ శాకాహార పదార్థం అయినా దేవునికి నైవేద్యంగా పెట్టడంలో తప్పు లేదని చెబుతున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రుచిగా శుభ్రంగా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజించడం వలన దేవుని అనుగ్రహం పొందుతామని... మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యం అయినా దేవుడు సంతోషంగా ఆరగించి మన కోరికలను నెరవేరుస్తారు అని వేదమంత్రాలను అవపోశనపట్టిన పండితులు చెబుతున్నారు. మంచి మనసుతో ఏ పదార్ధాన్ని నైవేద్యంగా పెట్టినా భగవంతుడు తప్పక ఆరగిస్తారు. కనుక మీకు చేతిలో కలిగినది దేవునికి పెట్టండి...అయన మీ కోరికలు తీరుస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి