తిరుమ‌ల శిఖ‌రాల‌పై కొలువున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం కోసం నిత్యం వేల‌ల్లో, ల‌క్ష‌ల్లో భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. క‌లియుగ దైవ‌మైన ఆ వేంక‌టేశ్వ‌రుడి నివాస స్థ‌ల‌మైన తిరుమ‌ల గురించి, ఆల‌యంలో స్వామివారి జ‌రిగే సేవ‌ల గురించి, బంగారు వాకిలి గురించి.. ఇలా దేవాల‌యంలో ఇమిడివున్న అన్ని అంశాల‌పై మ‌న‌కు ఎంత అవ‌గాహ‌న ఉందో ఒక‌సారి తెలుసుకుందాం. వీటిని ప్ర‌శ్న‌, జ‌వాబు రూపంలో మ‌న ఇంట్లో చిన్నారుల‌కు కూడా అల‌వాటు చేస్తే జీవిత‌కాలం వీటిని గుర్తుపెట్టుకుంటారు.

1. తిరుమల  పూర్వ నామధేయమేమిటి?                        
వరాహ‌పర్వతం.
2.   శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు?
ఉగ్రాణం.
3.    వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
నడిమి పడికావ‌లి.
4.     స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు?
 పరిమళపు అర.
5.    సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
పోటు.
6.   వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
30 అడుగులు.
7.     విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
అంగప్రదక్షణ.
8.    బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
మహామణిమండపం.
9.      బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?
 కొలువు మండపం.
10.     రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
శయన మండపం.
11.       శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
అద్దాల మండపం.
12.    అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి?
డోలా మండపం.
13.   అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
రంగనాయకుల మండపం.
14.   తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?
రాజా తొదరమల్లు.
15.    ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
బలి పీఠం.
16.     శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
కోయిల్ తిరుమంజనం.
17.       చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
4 సార్లు.
18.      విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
2 సార్లు
19.    సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
29
20.       ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
7 సార్లు

మరింత సమాచారం తెలుసుకోండి: