మన ఇంట్లో  ఉండేటటువంటి గడప మనం ఒక ఆధ్యాత్మిక శక్తిగా కొలుస్తాం. ప్రతిరోజు నీటితో శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అలాంటి గడపకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అది ఏంటో తెలుసుకుందామా..! మన ఇంట్లో ఉండే గడప కానీ, దేవాలయాలలో ఉండే గడప కానీ మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు.  భారతీయులు సనాతన సంప్రదాయాన్ని పాటించే వారిలో గడప ఒక పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. నిజంగా మనం కొత్త ఇల్లు కట్టినప్పుడు ముందు మనం గడప పెట్టినప్పుడు మంచి తిథి, నక్షత్రం, రోజు, సమయం, చూసి మరి మన ఇంటి ఆడపడుచుతో పిలిచి ఆమెతో పసుపు

 రాయించి మామిడి తోరణం కట్టించి పూలదండ వేయించి  గడపను అలంకరించి ఆడబిడ్డకు కట్నం పెట్టి మరి ఆ పూజ చేస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే  గడపకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం దీన్ని సైన్స్ ప్రకారం చూస్తే మనం దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న గుమ్మన్ని పెట్టినప్పుడు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెబుతారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే గుమ్మంలో నిలబడి ఏ పని అయినా సరే చేయకూడదు. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వాలన్న, తీసుకోవాలన్న గుమ్మం లోపలికి వచ్చి అయినా పని పూర్తి చేయాలి లేదంటే బయటకు వెళ్ళి అయినా ఆ పని పూర్తి చేయాలి. ముఖ్యంగా ఒక పుణ్యక్షేత్రానికి ఎంత విలువ ఉంటుందో మన గుమ్మానికి కూడా అంతే విలువ ఉంటుంది.   శుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని మనం నమ్ముతాం. కాబట్టి మన గడపలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనం గడపను  శుభ్రంగా చేసి   చక్కగా  పువ్వులతో అలంకరిస్తారు.  అయితే కొంత మంది అంటూ ఉంటారు. పసుపుకుంకుమలు రాస్తే లక్ష్మీదేవి వస్తుందా అని, ముఖ్యంగా పూర్వం రోజుల్లో ప్రతిరోజు గడపను శుభ్రం చేసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో అదంతా మారిపోయి శుక్రవారం కానీ మంగళవారం కానీ సోమవారం కానీ గడపను శుభ్రం చేసుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది గడపకు పసుపు రంగు వేశాము కాబట్టి ఇక కడగనక్కర్లేదు అని అనుకుంటారు. కానీ పసుపు తో గడప అలంకరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. పసుపు యాంటీ బయాటిక్  పనిచేస్తుంది.

 కాబట్టి పసుపు తో మనం అలంకరించడం వల్ల మన శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు కానీ బ్యాక్టీరియాలు కానీ తొలగిపోతాయి. ఎలా అంటే మనం బయట పని నిమిత్తం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన ఆ ఇంట్లోకి పోవాలంటే ప్రధాన ద్వారం గడప దాటి వెళ్ళాలి. ఈ సందర్భంలో మన శరీరం పైన బ్యాక్టీరియాలు గడపకు పసుపు తో అలగడం  వల్ల తొలగిపోతాయి. కాబట్టి పూర్వం వారు ప్రతిరోజు గడప అలగడం  వలన ఎంతో ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి రోగాలు లేకుండా ఉండేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: