మనకు ఏదైనా ఆపద వస్తే దేవున్ని మొక్కుకుంటాం. సమాజంలో ఒక్కొక్కరు ఒక విధమైన కోరిక తీర్చమని దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.  దేవుడా నాకు ఇది నెరవేరితే 100 కొబ్బరికాయలు కొడతాను, లేదా కోళ్లను, మేకలను కోస్తాను అని మొక్కులను ముడుపుగా వేస్తారు. కానీ వారు అనుకున్నది నెరవేరిన తరువాత కొంతమంది మర్చిపోతారు. మరి  మొక్కిన మొక్కులు నెరవేర్చకుండా మర్చిపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..? మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇవ్వకపోతే ఏం అనుకుంటాం.

ఇవ్వమని తిడతాం. ఇది కూడా అలాంటిదే మనం మన మొక్కలు తీర్చమని దేవుని అడిగి సమస్య నెరవేరక, తీర్చకపోతే అసత్య దోషం అనేది వస్తుంది.  పరమ శక్తి అయినటువంటి భగవంతుడి విషయంలో మనం ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే మాట తప్పిన వాళ్ళం అవుతాము. మనం మాట తప్పం  అంటే అసత్య దోషం  మనకు వచ్చినట్టే. దశరథుడు అందుకే చనిపోయాడు కైకకు  ఎప్పుడో  ఇచ్చినటువంటి మాట ఇవాళ తీర్చు ఆ రెండు కోరికలు అంటే, అప్పుడు దశరథుడు అవి కాకుండా ఇంకేదైనా అడగరాదా  అని కాళ్ళ మీద పడి బ్రతిమిలాడాడు. అంతటి పుణ్య దేవుల్లే మాట మీద నిలబడ్డప్పుడు మనం ఎంత అని ఆలోచించాలి. మనం మాట ఇచ్చి నిలబడకపోతే దేవుడు మనకు శాపం  పెడతాడా, మనల్ని క్షమించడా అనేది మనం ఆలోచిస్తే  అంతటి మహిమలు కలిగిన దేవుడు మనల్ని ఏమీ అనడు. ఆయన మనల్ని అనడానికి  మనలాగా ఏం మాట తప్పి ఇవ్వకపోతే శిక్షించే వారు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకో లేకపోతే నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్లే బదులు, అదమ  లోకానికి వెళ్లిపోతావ్. అబద్దం ఆడిన వారు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటావు. నీవు ఆడిన అబద్ధం చిన్నదా పెద్దదా అన్న దాన్ని బట్టి  నువ్వు ఏ స్థాయిలో కి వెళ్తావు అనేది నిర్ణయం జరుగుతుంది. అంతేగాని ఇందులో దేవుడికి ఏం సంబంధం లేదు. మనది మనకే ఒక గిల్టీ నెస్ ఏర్పడుతుంది.

ఎందుకంటే మొక్కుకొని సమస్యలు తీరాక దాన్ని నెరవేర్చుకోవడం వల్ల ఈ ఫీలింగ్ ఏర్పడుతుంది. దీని కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది. మనం అనుకున్న మొక్కలు మర్చిపోయాం అనుకుంటాం గానీ  దాని సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం తొందరగా బయటకు వస్తుంది. ఏది ఏమైనా చేసిన కర్మ అనుభవించక మానదు. ఇందులో దేవుడికి ఏం సంబంధం ఉండదు. మనం మాట ఇచ్చి తప్పిన దోషం మాత్రం మన వెంబడే ఉంటుంది అనేది మనం తప్పని సరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మనం మొక్కిన మొక్కులు తీర్చుకోవడం  అనేది మనకు సంబంధించిన విషయము. తీర్చడం వల్ల మనకు ఇంకా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అనేది వేదాంత నిపుణులు తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: