మన వంట గదిలోని మాసాల దినుసుల్లో,చూడటానికి చిన్నగా కనబడే నల్ల మిరియాలు మనుషులు తమ జీవితంలోని ఎన్నో పెద్ద సమస్యలను పరిష్కరించుకోవడానికి వాడుకోవచ్చు.మీ ఇంట్లో అధిక ఆర్థిక సమస్యలు వున్నా లేదా ఎంత ప్రయత్నించినా అనుకున్న పనుల్లో విజయం సాధించలేకపోయినా జ్యోతిషశాస్త్రంలో నల్ల మిరియాలతో చేసే నివారణలతో వాటిని అదిగమించవచ్చు.ఇది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కూడా..

ఆర్థిక సమస్యలతో బాధపడేవారు..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 5 నల్ల మిరియాలనుతీసుకుని,మన చుట్టూ 7 సార్లు చూడుతూ దిష్టి తీసి,ఆ మిరియాలను ఎవరు తొక్కని ప్రదేశంలో ఉంచి,వాటిని కాల్చి బూడిద చేయాలి.ఇలా చేయడం వల్ల ఏమైనా దృష్టి దోషాలు ఉంటే తొలగి,ఇంట్లో ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.మరియు ఈ నివారణ చేసిన తర్వాత వాటిని తిరిగి చూడకూడదు.

అనుకున్న పనులు సజావుగా జరగడానికి,లేదా మీరు ఏదైనా ఉద్యోగంలో విజయం సాధించకలేక ఇబ్బంది పడుతుంటే,అలాంటి వారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏదైనా పనిని పని మీద బయటకు వెళ్ళేటప్పుడు,ముందు ఇంటి ప్రధాన గుమ్మంపై నల్లమిరియాలు ఉంచి,దానిపై నుండి దాటి వెళ్ళాలి. ఇలా చేయడంతో విజయం సాధిస్తారు.

ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు జరగకపోవడానికి మనకున్న శత్రువులే కారణం అవచ్చు. ఇలాంటి శత్రువులను తొలగించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజున నల్ల మిరియాలతో ఓం క్లీన్ బీజా మంత్రాన్ని జరిపించి,ఇంటి సభ్యుల మీద దిష్టి తీసి,పారే నీటిలో వేయడం వల్ల శత్రు శేషం తొలగుతుంది.

ఏలినాటి శని ఉన్నా కూడా మనం అనుకున్న పనులు జరగవు కనుక శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలు పోగొట్టుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నల్లని  గుండముక్క తీసుకొని,అందులో  ఎండుమిర్చి,11 రూపాయలు,గుప్పెడు మిరియాలు వేసి మూట కట్టి పేదవారికి దానం చేస్తే శని దోషం తగ్గుతుంది.మరియు మీరు అనుకున్న పని తరచుగా చెడిపోతుంటే, 7-8 ఎండుమిర్చి గింజలను తీసుకుని,ఇంట్లో ఆగ్నేయ మూలలో ఉంచి కాల్చాలి.ఇలా చేయడంతో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి.మరియు పనులు సులభంగా పూర్తవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: