చాలా మంది ప్రజలు దైవభక్తిని కలిగి ఉన్నారు. ముఖ్యంగా హనుమంతుడిని ఎక్కువగా పూజించే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది .ఎందుకంటే ప్రతి గల్లీలో, ఊరిలో కూడా హనుమాన్ టెంపుల్ కచ్చితంగా ఉండనే ఉంటుంది. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఎన్నో కష్టసుఖాలను సైతం మటుమాయం చేస్తారు.అలాగే తాము కోరుకున్న కలలను కూడా నెరవేరుస్తారని భక్తులు ఇప్పటికీ నమ్ముతూనే ఉంటారు. ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఇష్టమైన రోజు మంగళవారం అని ఆ రోజున పూజిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు.


అయితే మరికొందరు మాత్రం శనివారం రోజున పూజిస్తూ ఉంటారు.. ఇదంతా పక్కన పెడితే ఆంజనేయస్వామిని పూజించేటప్పుడు ఇలా చేస్తే ఎలాంటి అవరోధాలు ఎదురవ్వకుండా సుఖసంతోషాలతో ఉంటారట. ఆంజనేయ స్వామిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధలు ఉండవనేవి చాలామంది పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంజనేయస్వామి దేవాలయంలో ఉండే రావి చెట్టుకి 11 సార్లు ప్రదర్శనలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మహిళలు కూడా ఇలాంటివి చేయడం వల్ల ఆ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారు.


దాదాపుగా 41 రోజులపాటు రాగి చెట్టు తిరుగుతూ ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ముందుగా ఆంజనేయ స్వామి దగ్గర దీపాన్ని వెలిగించి రావి ఆకుల పైన పిండితో తయారుచేసిన దీపాల కుంకుమలతో అలంకరించి దీపాలను వెలిగించాలి. దీపాలను వెలిగించేటప్పుడు కాస్త బెల్లం వేసి వెలిగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో మనస్పర్ధలు లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్న రామ భజన చేస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అయితే పూజ చేస్తున్నానన్ని రోజులు తల్లిదండ్రులు అలాగే గోమాత ప్రదర్శన చేయడం చాలా ముఖ్యమట. ఏదైనా మూగజీవాలకు భోజనం పెట్టినా కూడా చాలా మంచి జరుగుతుందని పండితులు సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: