పౌర్ణిమ తిథి వివరాలు
వేద క్యాలెండర్ ప్రకారం—
పౌర్ణిమ తిథి ప్రారంభం: డిసెంబర్ 4 ఉదయం 8:37
పౌర్ణిమ తిథి ముగింపు: డిసెంబర్ 5 ఉదయం 4:43
ఉదయ తిథి ఆధారంగా పౌర్ణమి డిసెంబర్ 4నే గనుక, పూజలు, ఉపవాసం, దీపారాధనలు ఇవన్నీ ఈ రోజునే చేస్తే శ్రేష్ఠం.
ఈ రోజున ఎందుకు చంద్రుడిని పూజిస్తారు?
పురాణాలు చెబుతున్న ప్రకారం, ఈ రోజు చంద్రుడు తన 16 కళలతో సంపూర్ణ రూపంలో వెలుగుతాడు. చంద్ర కాంతికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ కిరణాలు సానుకూలత, శాంతి, మానసిక స్థిరత్వాన్ని ఇస్తాయని నమ్మకం. అందుకే ఈ రోజు చంద్రదర్శనం, చంద్రారాధన శ్రేయస్కరం.
తులసితో చేసే ప్రత్యేక ఆచారం – అడ్డంకులు తొలగి, ఇంట్లో శాంతి నెలకొంటుందట
ఉజ్జయిని ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఆనంద్ భరద్వాజ్ గారి ప్రకారం—మార్గశిర పౌర్ణమి రోజున కొత్త తులసి మొక్కను కొని ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో నాటితే ఇంటిలోని ప్రతికూలశక్తులు తొలగి, సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతారు. ఈ ఆచారం ఇంటి వాతావరణానికి సామరస్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుందని విశ్వాసం.
ఈ రోజున పాటించాల్సిన నియమాలు
ఈ పవిత్ర దినంలో కొన్ని విశిష్ట నియమాలను పాటించడం ఉత్తమం:
*మాంసాహారం పూర్తిగా నివారించాలి
ఈ రోజు శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం.
*నోటి నుండి అపశకునం, చెడు మాటలు రాకుండ చూడాలి
రోజంతా మంచి మాటలు, మంచి ఆలోచనలు ఉండాలి.
*మహిళలు ఏడవకూడదు
శాస్త్రం ప్రకారం, పౌర్ణమి రోజున మహిళలు కన్నీరు కార్చడం అశుభంగా భావిస్తారు.
* ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలి
వివాదాలు, గొడవలు, కోపం — ఇవన్నీ పూర్తిగా దూరంగా ఉంచాలి.
*భార్య–భర్తలు వాగ్వాదాలు చేయరాదు
అమ్మవారి దయ, దంపతుల జీవితంలో సౌభాగ్యం పెరుగుతుందని విశ్వాసం. రాత్రి 12 లోపే ఉప్పు ప్రమిద దీపం వేయాలి — గొప్ప ఫలితమంటారు . సాయంత్రం లేదా రాత్రి 12 లోపు లక్ష్మీదేవి ముందు ఉప్పుతో చేసిన ప్రమిద దీపం వెలిగిస్తే—కోటి జన్మల పుణ్యం..లక్ష్మీకటాక్ష..ధనసమృద్ధి..ఇంట్లో సంపూర్ణ శాంతి..దారిద్ర్య నివారణ..ఇవన్నీ లభిస్తాయని శాస్త్రాలు స్వీకరిస్తాయి. అమ్మవారి కటాక్షంతో ఆ ఇంటికి ఆసీసులు, ఐశ్వర్యం, సకల శుభాలు చేరతాయని చెప్పబడింది.
ముఖ్య గమనిక: ఈ కథనంలో సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం అని పాఠకులు గుర్తుంచుకోవాలి..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి