ఇర్ఫాన్ పఠాన్... టీమిండియా మాజీ ఆటగాడు. పఠాన్ బ్రదర్స్ లో చిన్నవాడైన ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు అనేక విజయాలను అందించాడు. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో ఎంత స్వింగ్ ఉంటుందో మనకందరికీ తెలిసిన విషయమే. ఇక ఇర్ఫాన్ పఠాన్ తాజాగా ఒక సంవత్సరం సమయం ఇచ్చి సెలెక్టర్లు టీమిండియాలో కి మళ్ళీ ఎంపిక చేస్తామంటే.. ఆడేందుకు సిద్ధమని తెలియజేశారు. ఈ విషయాన్ని సురేష్ రైనాతో ఇంస్టాగ్రామ్ లైవ్ చాట్ లో తన మనసులోని మాట బయట పెట్టాడు ఇర్ఫాన్. అంతేకాకుండా నిజానికి అలా జరగాలి అంటే సరైన సంప్రదింపులు అవసరమా అని ఇర్ఫాన్ అన్నాడు. 

 

ఇక ఇద్దరు సంభాషణలో నా దగ్గరకు సెలెక్టర్లు వచ్చి.. ఇర్ఫాన్ నువ్వు రిటైర్మెంట్ అయ్యావు కదా కానీ ఏడాది సమయం ఇస్తే మళ్ళీ టీమిండియాకు ఎంపిక చేస్తాం అని తెలియ చేస్తే అప్పుడు నేను అన్నీ వదిలేసి ఆట మీద దృష్టి సాధిస్తా.. తీవ్రంగా దానిమీదే కష్టపడతా.. అని తెలిపాడు. కానీ.. అలా అడిగేది ఎవరు అని సురేష్ రైనాతో ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ఇక అంతే కాకుండా రైనానీ కూడా ఆరు నెలలు సమయం ఇచ్చి ప్రపంచ కప్ కు ఎంపిక చేస్తాము అని అంటే నువ్వు సిద్ధమా అని అడిగాడు. అందుకు సురేష్ రైనా బదులు ఇస్తూ కచ్చితంగా దానిమీద దృష్టి పెడతాను అని హితవు పలికాడు. 

 


ఇర్ఫాన్ 2003 సంవత్సరంలో 19 ఏళ్ళ వయసులో టీమిండియాకు ఎంపిక ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ పై టెస్టులలో హ్యాట్రిక్ వికెట్లు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇర్ఫాన్ మొత్తం 29 టెస్ట్ మ్యాచ్ లు అడి వంద వికెట్లు తీయడం జరిగింది. అలాగే 120 వన్డేలు ఆడి  173 వికెట్లు తీశాడు. అలాగే కొన్ని సందర్భాలలో మంచి పరుగులు తీయడం జరిగింది. ఇక చివరి సారిగా 2012లో టీమిండియాకు ఆడిన ఇర్ఫాన్ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ తరఫున క్రికెట్ కెరియర్ లో ముందుకు కొనసాగాడు. ఈ తరుణంలోనే ఈ సంవత్సరం జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: