ఏడాది టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఎందుకంటే గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును  ఒకసారి గెలిపించి టైటిల్ అందించిన వార్నర్ సారథ్యంలో మరోసారి ఐపీఎల్ బరిలోకి దిగింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట మునుపటి పామ్ లో  లేకపోవడంతో కాస్త తడబడుతూనే ప్రస్థానాన్ని కొనసాగించి. ఈ క్రమంలోనే చివరి వరకు పోరాడి ప్లే ఆప్ కి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్థానం సంపాదిస్తుందా  లేదా అని అభిమానుల్లో  ఎంతగానో టెన్షన్ నెలకొంది. అయితే సీజన్ ప్రారంభంలో తడబడుతూ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు  ఆ తర్వాత మాత్రం బాగా పుంజుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు  గెలవాల్సిన ప్రతి  మ్యాచ్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తూ దూసుకొచ్చింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇలా అన్ని జట్లను  వెనక్కి నెట్టి ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ప్లే ఆప్ కి క్వాలిఫై అయింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి . ముఖ్యంగా వరుస విజయాలతో దూసుకుపోతూ... ఐపీఎల్ 2020 సీజన్ లో ప్లే ఆప్ కి అర్హత సాధించిన మొదటి రికార్డు సృష్టించిన... ముంబై ఇండియన్స్ తో  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడి గెలుస్తుందా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.



 కానీ ఎవరూ ఊహించని విధంగా... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ సీజన్ లో దిగ్గజ  జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ జట్టు కు బ్రేకులు వేసి... అన్ని విభాగాల్లో  ఆధిపత్యం సాధించి మెరుగైన ప్రదర్శన చేసి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే  కాదు... ప్లే ఆప్ కి అర్హత సాధించింది. కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని అందుకోవడం అభిమానులందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ప్లే ఆఫ్ కి  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు  క్వాలిఫై అవడం చివరికి కోల్కతా నైట్రైడర్స్ ఇంటిదారి పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: