ఈ క్రమంలోనే స్టేడియం కి వెళ్లి మ్యాచ్ ను డైరెక్ట్ గా వీక్షించాలని ప్రేక్షకుల కోరిక ఎప్పుడు తీరుతుందో అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు. స్టేడియం లకు ప్రేక్షకులను అనుమతించని నేపథ్యంలో ప్రస్తుతం కేవలం టీవీ లో మాత్రమే క్రికెట్ మ్యాచ్లు వీక్షిస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు ఇలాంటి క్రమంలో ప్రస్తుతం అందరికీ శుభ వార్త అందింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 8వ తేదీన జరిగే మూడో టి20 కు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను స్టేడియం లోకి అనుమతించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు.
ఎందుకంటే స్టేడియంలోకి ప్రేక్షకులు అనుమతించడం పై ఐసీసీ విధించిన ఆంక్షలు ఈ నెల 7 తొలగిపోనున్న నేపథ్యంలో ఈనెల 8వ తేదీన జరిగే భారత్ ఆస్ట్రేలియా మూడో టి20 కి పూర్తిస్థాయిలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్ కి పూర్తిస్థాయిలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే శుభవార్త అదే చెప్పాలి. ఇన్ని రోజుల వరకు కేవలం టీవీ లలో మాత్రమే మ్యాచ్ వీక్షించిన క్రికెట్ ప్రేక్షకులకు ఇప్పుడు స్వయంగా స్టేడియం కి వెళ్లి మ్యాచ్ వీక్షించే అవకాశం వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి